ఏ సీజన్లో అయినా విరివిగా దొరికే వాటిలో ముందుండేది దొండకాయ. సాధారణంగా ఇది చౌక గానే దొరుకుతుంది. దొండకాయతో వేపుళ్లు, కూరలు చేసుకుంటారు. గుత్తి వంకాయ లాగే దొండ కాయలను కూడా నాలుగు పక్షాలుగా చీర్చి కూర చేసుకుంటారు. పచ్చడి చేసుకుంటారు. బాలింతలకు, జ్వరం వచ్చి తగ్గిన వారికి దొండకాయ కూరను పథ్యంగా పెడతారు

ముఖ్యంగా రోజువారీ ఆహా రంలో ఒక కప్పు మేర దొండ కాయను తీసుకుంటే డయాబెటిస్ ను నిరోధించే వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇందులో ఉండే క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. దొండ ఆకుల పేస్టును మాత్రల్లా వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మసమస్యలు వుండవు. జలుబు, దగ్గును కూడా దొండనయం చేస్తుంది. శరీరం నుంచి మలినాలను చెమట ద్వారా వెలి వేస్తుంది.

దొండకాయ రక్తపోటు ను, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. పీచు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు హానికర బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి

దగ్గు, ఆకలి లేకపోవడం.. వంటి వాటితో బాధపడేవారు దీన్ని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దొండలో ఉండే బి-విటమిన్ నాడీ వ్యవస్థను రక్షిస్తుంది.

మానసిక ఆందోళన, మూర్చ వ్యాధితో బాధపడేవారికి దొండకాయ చక్కటి పరిష్కారం.దీనిలోని క్యాల్షియం మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. అయితే ఎన్ని ప్రయోజనాలున్నా దొండకాయను వారానికి మూడు సార్లకు మించకుండా తీసుకోవటమే మంచిది