నిమ్మ ఆకులతో ప్రయోజనం…
నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంత మంచిదో.. ఆకులు కూడా అంతే ఉపయోగమైనవి. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి1, ప్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి.
నాలుగు తాజా నిమ్మ ఆకుల్ని ఒక గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానబెట్టి తాగితే.. నిద్రలేమి, గుండెదడ, నరాల బలహీనత వంటివి తగ్గుతాయి. వేడినీటిలో మరిగించకూడదు. కేవలం నానబెట్టలి. అంతే!
నీళ్లను వేడిచేసి దించేయాలి. అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి.
మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిమ్మ ఆకుల్ని నలిపి.. ఆ వాసన పీలిస్తే మంచిది. మనసు వెంటనే ఆహ్లాదకరంగా మారుతుంది..
నిమ్మ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి, అందుకని నిమ్మను పలు రూపాల్లో సౌందర్య ఉత్పత్తులలో వాడుతున్నారు.
ముఖం మీదున్న మచ్చలు, మొటిమలను కూడా పోగొడతాయివి. నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. పళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు ఆరోగ్యంగా మారతాయి.
స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది. నిమ్మ ఆకుల్ని హ్యాండ్ వాష్ లా వాడవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు పూనుకుంటే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. వికారం పోవడానికి నిమ్మ ఆకుల్ని వాడవచ్చు.