చాలామంది కాకరకాయను చూడగానే ముఖం చిట్లిస్తారు. చేదంటూ దాని జోలికే వెళ్లరు. కానీ కాయ చేదైనా దాంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే వారంలో ఒకసారైనా కాకరకాయను ఏదో ఒక వంటకంగా చేసుకుని తినండి. వంట ప్రక్రియలో చేదును విరిచేసే ప్రక్రియలూ ఉంటాయి. వాటిని అనుసరించి కాకరకాయను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే..

కాకరకాయలో క్యాలరీలు చాలా తక్కువ అందుకే స్థూలకాయం, ఊబకాయం, రాకుండా నివారిస్తుంది. క్యాలరీలు తక్కువగా పోషకాలు మాత్రం చాలా ఎక్కువ.

ఇందులో విటమిన్ బి1, బి2, బి3, సి… లతో పాటు జీర్ణక్రియకు దోహదం చేసే పీచు ఎక్కువగా ఉంటుంది.
మెగ్నీషియ్, ఫోలేట్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలూ ఎక్కువ.

కాకరలోని విటమిన్-సి దేహంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. మన దేహంలో పుట్టే ఫ్రీరాడికిల్స్ మ్యాలిగ్మంట్ కణాల (క్యాన్సర్ కారక కణాలు) ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఇలా కాకర సాధారణ క్యాన్సర్లనే కాకుండా, లుకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్లను నివారిస్తుంది.

కాకరకాయ కడుపులో చేరిన పరాన్నజీవులను హరిస్తుంది. కడుపులో నిల్వ చేరిన విషపూరితమయ్యే వ్యర్థాలను తొలగిస్తుంది.

కాకర మలేరియా బ్యాక్టీరియానూ తుదిముట్టించగలదు. చికెన్‌పాక్స్, మీజిల్స్, హెర్బ్స్), హెచ్ఐవి కారక వైరస్ లను శక్తిహీనం చేస్తుంది.

కాకర గింజలు గుండె పనితీరును క్రమబద్ధం చేస్తాయి. ఇవి రక్తనాళాల్లోని కొవ్వును కరిగించి గుండె గదులు, రక్తనాళల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి.

డయాబెటిస్ వ్యాది గ్రస్తులకు కాకర మంచి స్వాభావికమైన ఔషధంగా అనుకోవచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తగ్గిస్తుందన్న విషయం నాన్నకు చాలామందికి తెలిసిందే.

బ్లడ్ ప్రెషర్ లో హెచ్యుతగ్గులు లేకుండా చూస్తుంది.
కాలేయంపై పడే అదనపు భారాన్ని కూడా కాకర నివారిస్తుంది.