పోషకాలతో నిండిన ఆరోగ్యవంతమైన ఆహారం ఎముకల సూప్. ఈ సూప్ తో నూరు శాతం ప్రయోజనాలు దక్కాలంటే రోజంతా ఎటువంటి ఘనాహారం తీసుకోకుండా, తరచుగా ఈ సూప్ తాగుతూ బోన్ సూప్ ఫాస్టింగ్ చేయాలి.

ఎముకలు, మజ్జ, టెండాన్లు, చర్మం, లిగమెంట్లు… వీటిని ఎక్కువ సమయం పాటు ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు వెలువడి, సూప్ లో కలుస్తాయి. గ్లైసీన్, ఆర్డినీన్, ప్రోలీన్ మొదలైన అమీనో యాసిడ్లతో పాటు, విటమిన్లు, ఖనిజ లవణాలు, గ్లూకోజమైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎముకల సూప్ తో పొందవచ్చు. శరీరం మొత్తంలో ఆరోగ్యకర మైన కణజాల నిర్మాణానికి తోడ్పడే కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఎముకల సూప్ లో సమృద్దిగాఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేనివాళ్లు, నెలలో ఎముకల సూప్ ఫాస్టింగ్ అనుసరిస్తే మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణశక్తి: దీన్లో కొల్లాజెన్ ఉంటుంది. జీర్ణకోశం, పేగుల లోపలి పొర నిర్మాణానికి తోడ్పడుతుంది. కాబట్టి అజీర్తి, విరోచనాలు, మలబద్దకం మొదలైన సమస్యలు తగ్గుతాయి.

చర్మం: చర్మంలోని కణజాలాల నిర్మాణానికి కొల్లాజెన్ అవసరం. బోన్ సూప్ లోని కొల్లాజెన్ తో చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. సాగే గుణం పెరిగి, యువ్వనంగా కనిపిస్తుందిపోషకాలు: నిండైన ఆరోగ్యానికి అవసరమైన అత్యవసర పోషకాలు ఎముకల సూప్ లో లభిస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ బోన్ సూప్ తో దక్కుతాయి.

కండరాలు: కండర పటుత్వంలో కీలక పాత్రను పోషించే అమినో యాసిడ్ గ్లైసీన్. కణాల్లోకి శక్తిని ప్రవహింపచేసి, కండరాలకు శక్తినిచ్చే ఈ పోషకం తగ్గితే కండరాలు క్షీణించి, కండర నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అమినో యాసిడ్ పుష్కలంగా దొరికే బోన్ సూప్ తీసుకోవడం ద్వారా కండరాలను బలపరుచుకోవచ్చు.

కాలేయం: యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథియోన్ శరీరంలోని విషాలను సమర్థంగా హరించే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్ బోన్ సూప్ లో దొరుకుతుంది.
ఇమ్యూనిటీ: ఈ సూప్ తో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ మరింత బలపడుతుంది.

నిద్ర: ఎములక సూప్ లోని అమీనో యాసిడ్లు ఇన్హిబిటరీ న్యూరోట్రాన్స్మిటర్లలా పని చేస్తాయి. ఇవి నిద్రకు, స్పష్టమైన ఆలోచించగలిగే, నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యానికీ, జ్ఞాపకశక్తికి తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి.