తిన్న వెంటనే ఛాతీలో మంట మొదలవుతూ ఉందా? త్రేన్పులతో పాటు గొంతులోకి యాసిడ్ తన్నుకొస్తోందా? అయితే ఈ చిట్టి చిట్కా పాటించండి. అసిడిటీ టక్కున సర్దుకుంటుంది.

అసిడిటీ లక్షణాలు మొదలైన వెంటనే నాలుగైదు తులసి ఆకులు తినాలి. తర్వాత అరగ్లాసు నీళ్లలో తులసి ఆకులు వేసి బాగా మరిగించి కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నా ఉపశమనం కలుగుతుంది. సోంపు, దాల్చిన చెక్కలు కూడా అసిడిటీకి విరుగుడే! అసిడిటీని అదుపు చేయటం కోసం వీటితో తయారైన టీలు తాగినా ఫలితం ఉంటుంది.

అమ్మమ్మ చిట్కా:

ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల తలనొప్పి వచ్చినా, తల తిరుగుతున్నట్లు అనిపించినా, చిన్న అల్లం ముక్క నూరి, నిమ్మరసంలో కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.