బరువు తాగ్గాలంటే.. ఇలా
బరువు తగ్గడానికి జిమ్ కి వెళ్ళడం, డైటింగ్ చేయడం.. ఇలా రకరకాలుగా ట్రై చేస్తుంటారు చాలామంది. అయితే, పొద్దునే లేవగానే కొన్ని అలవాట్లు పాతిస్తే, పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గొచ్చు అంటున్నారు వైద్యులు. అంతేకాదు మానసికంగా, శారీరకంగా హుషారుగా ఉంటారని చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య చిట్కా ఏమిటో చూద్దాం.
ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చుంటే విటమిన్ – డి అంది ఎముకలు గట్టిపడతాయి. శరీరంలోని కొవ్వు కణాల పరిమాణం తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. హార్మోన్స్ బ్యాలన్స్ అవుతాయి.
బరువు తగ్గాలంటే ప్రతిరోజు వ్యాయామం తో పాటు హెల్దీ ఫుడ్ తినాలి. పొద్దున ఎక్సర్సైజ్చేసిన మహిళలు అవుతుంది. తొందరగా బరువు తగ్గుతారు. రెగ్యులర్గా వర్కవుట్స్ చేస్తే బరువు తగ్గడం ఏమంత కష్టం అనిపించదు.
పొద్దున లేవగానే నీళ్లు తాగడం మర్చిపోవద్దు. నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగితే ఇంకా మంచిది. ఎందుకంటే… నీళ్లు తాగితే మెటబాలిజం వేగంగా జరిగి శరీరంలోని టాక్సిన్లు బయటికి పోతాయి. దాంతో క్యాలరీలు ఎక్కువ కరుగుతాయి.
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్లు ఎక్కువ ఉండే గుడ్లు, పాలు, పప్పులు, బాదం, పెరుగు, పల్లీలు వంటివి ఉండాలి. వీటిలోని ప్రొటీన్లు ఆకలిని కంట్రోల్ చేయడమే కాదు మెటబాలిజం వేగంగా జరిగేలా చేస్తాయి.
స్ట్రెస్ లో ఉన్నప్పుడు కార్టిసోల్ హార్మోన్ రిలీజ్ ఈ హార్మోన్ ఆకలిని పెంచుతుంది. దాంతో ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతారు. అలా జరగకూడదంటే ఎప్పుడూ ప్రశాంతంగా, అలా ఉంటే స్ట్రెస్ అనిపించదు. బరువు కూడా పెరగరు..
ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్నాక బరువు చెక్ చేసుకోవాలి. ఇలాచేస్తే, బరువు తగ్గడంలో ఏమేం వర్కవుట్స్, ఏ రకం ఫుడ్ పనికొస్తుందో తెలుస్తుంది. సొంతంగా బరువు చూసుకున్నవాళ్లు మిగతావాళ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ బరువు తగ్గారని 2016లో అమెరికాలోని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్, డైటెటిక్స్ జర్నల్ లో వచ్చిన స్టడీ చెప్పింది. ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసేవాళ్లలో 20 శాతం ఎక్కువ ఫ్యాట్ తగ్గినట్లు లండన్లోని నార్త్ అంబ్రియా యూనివర్సిటీ రీసెర్చర్ల స్టడీలో తేలింది…