సన్నబడేందుకు వీటిని తినండి
సాధారణంగా తింటే బరువు పెరుగుతామనుకుంటాం. కానీ వీటిని తింటే తగొచ్చంటున్నారు నిపుణులు. నట్స్ అన్ని రకాల నట్స్ లోనూ వెజిటబుల్ ప్రొటీన్ శాతం, ఎక్కువగా దొరుకుతుంది. గుండెకు మేలు చేసే అశాచురేటెడ్ ఫ్యాటలూ, విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, సహజంగా మొక్కల నుంచి అందే స్టీరోల్స్ వంటివన్నీ లభిస్తాయి. రోజూ గుప్పెడు నట్స్ ని ఎంచుకోవడం వల్ల సగటున కనీసం ఐదుశాతం కొలెస్టాల్ ని తగ్గించే శక్తి ఉంటుందట. ముఖ్యంగా గంటల తరబడి కదలకుండా కూర్చునే ఉద్యోగులు వీటికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
సోయా: సోయా ఉత్పత్తుల్లో సహజంగానే శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. అలానే ఇందులోని కొన్ని రకాల ప్రొటీన్లు శరీరంలోని కొలెస్టాల్ ని సమన్వయం చేస్తాయి. పదిహేను గ్రాముల సోయా ఉత్పత్తులను రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరంలో కనీసం ఆరు శాతం కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అంతేకాదు పాలు, పెరుగు తినని వారు ప్రత్యామ్నాయంగా దీన్ని ఎంచుకోవచ్చు.
పండ్లూ కూరగాయాలు : వీటిల్లో శాచురేటెడ్ ఫ్యాట్లు తక్కువగా ఉంటాయి. సమతుల పోషకాలు కలిగిన ఆకుకూరలు, కాయగూరల్ని రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు అందం, ఆరోగ్యం కూడా, టిఫిన్ తిన్న తరువాత ఓ పండు తినాలి. చపాతీ, అన్నం కంటే ఎక్కువగా కూరితీసుకోవడం మంచిది. ఫలితంగా జీర్ణప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. జీవక్రియా రేటు బాగుంటుంది. ఫలితంగా ఆరోగ్యకమైన బరువు మీ సొంతమవుతుంది.
ఓట్స్ బార్లీ : ఓట్స్, బార్లీ రెండింటిలోనూ అధి మోతాదులో శరీరంలో కరిగే పీచు ఉంటుంది. ఈ బీటా గ్లూకోస్ జెల్ లా రూపాంతరం చెంది కొలెస్ట్రాల్ ని పేగులు గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందుకే అదనంగా కొవ్వు పేరుకునే అవకాశం తక్కువ. త్వరగానూ బరువు తగ్గచ్చు.