గుండెపోటుకు 4 ఆహార పదార్దాలు ఇవే, వెంటనే మానకపోతే ప్రమాదమే
ప్రోసెస్ మీట్:
ప్రస్తుతం ప్రోసెస్డ్ మీట్ వాడకం ఎక్కువౌతుంది. చాలామంది ప్రోటీన్ల కోసం ప్రోసెస్డ్ మీట్ తీసుకుంటున్నారు. ఇందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటుకు కారణమౌతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ సమస్య ఎదురౌతుంది.
శరీరంలో ప్రధానమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఉంటుంది. హార్ట్ ఎటాక్ అనేది ప్రధానంగా హై కొలెస్ట్రాల్ కారణంగా వస్తుంది. రక్త నాళికల్లో బ్లాకేజ్ ఏర్పడి.. రక్తాన్ని గుండెకు సరఫరా చేయడంలో ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా హై బ్లడ్ ప్రెషర్ అనేది సంభవిస్తుంది. ఇక అక్కడి నుంచి హార్ట్ ఎటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజద్, ట్రిపుల్ వేసెల్ డిసీజ్ ఎదుర్కోవల్సి వస్తుంది. గుండె ఆరోగ్యంంగా ఉండేందుకు ఎలాంటి ఆహారపు
సిగరెట్ స్మాకింగ్, మద్యపానం :
సిగరెట్, మద్యం అనేవి ఊపిరితిత్తులు, లివర్లను పాడు చేస్తాయి. అంతేకాకుండా గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే సిగరెట్, మద్యం కారణంగా హై బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు ఎదురౌతాయి. ఈ అలవాట్లను సాధ్యమైనంత త్వరగా వదిలేయాలి.
సాఫ్ట్ డ్రింక్స్, ఆయిలీ ఫుడ్స్
అలసటగా ఉన్నప్పుడు లేదా దాహం వేసినప్పుడు చాలామంది సాఫ్ట్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇందులో సోడా మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల గుండెకు నష్టం కల్గిస్తుంది. తరచూ తాగడం మంచిది కాదు. హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది. ఇక మరో చెడు అలవాటు ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం. మనదేశంలో ఆయిలీ ఫుడ్స్ ప్రభావం ఎక్కువే. రుచి బాగున్నా.. ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. వీటివల్ల రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది. అందుకే ఆయిలీ ఫుడ్స్, ఫాస్టఫ్ఫుడ్స్, జంక్ఫుడ్స్ మానేయాలి