అత్యంత ప్రబలమైన క్యాన్సర్ రకాల్లో ఎముక క్యాన్సర్ ఒకటి. విలక్షణమైన ఎముక కణాలు నియంత్రణ లేకుండా వ్యాపించినప్పుడు బోస్ క్యాన్సర్ వస్తుంది. దీనికి చేతులు, కాళ్ళలో పెల్విస్ లేదంటే పొడవాటి ఎముకలు సాధారణంగా ప్రభావితమవుతాయి. అయితే, ఈ ఎముకల క్యాన్సర్ లక్షణాలను కొన్ని సూచికల ద్వారా గమనించవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి 5 లక్షణాలను వైద్యులు పేర్కొన్నారు. ఈ లక్షణాలు గనుక ఉంటే అది ఎముకల క్యాన్సర్ అవునో కాదో తెలుసుకోవడం మంచిది. ఇక వాటిని పరిశీలిస్తే..
1. నొప్పి, వాపు: ఎముకల్లో నిరంతర నొప్పి, వాపు కనిపిస్తే అది చింతించదగినదే. వీటికి అదనంగా, రాత్రి సమయంలో నిద్ర లేకుండా చేసే పోటు లాంటి నొప్పి (dull pain) ఉంటే డాక్టర్ను సంప్రదించడం మంచిది.
2. బరువు తగ్గడం: వేగంగా బరువు తగ్గడం అనేది శరీరంలో ఏదో తేడా ఏర్పడింది అనడానికి సంకేతం కావచ్చు.
3. అలసట: తరచుగా తీవ్ర అలసటను అనుభవిస్తున్నా, లేదంటే ఎక్కువగా అనారోగ్యంగా ఉన్నా, ఒకవేళ్ల మీ రోజువారీ పనులను చేయడం మీకు కష్టంగా ఉన్నా కాస్త అనుమానించాలి. అప్పుడు, వైద్యుల సూచనల మేరకు క్షుణ్ణంగా ఆరోగ్య పరీక్ష
చేయించుకోవడం మంచిది. ఎందుకంటే, ఎముకల క్యాన్సర్ తీవ్రమైన అలసట ద్వారా కూడా గుర్తించవచ్చు.
4. లింపింగ్: ఎముకల నొప్పితో నడవలేక కుంటుతూ ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. ఎముక క్యాన్సర్కు సంబంధించి, అత్యంత గుర్తించదగిన సంకేతాల్లో లింపింగ్ ఒకటి.
5. రాత్రి వేళ చెమటలు: తరచుగా రాత్రిపూట చెమట పట్టినట్లయితే, ఆమీరోగ్యం గురించి వైద్యుడికి తెలియజేయడం ఉత్తమం. వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈ పరిస్థితి ఎముక క్యాన్సర్కు కారణం కావచ్చు.