సరైనా ఆహారం లేకపోవడం, కంటి నిండా నిద్రలేకపోవటం, జంకుడక్కు అలవాటు పడటం. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఈ దుష్పభావాలన్నింటి కారణంగా గుండెలయ మారుతుంటుంది. ఈ సమస్యలకు పెరట్లో పండే సొరకాయ చక్కటి పరిష్కారం అని మీకు తెలుసా. చాలామందికి సొరకాయ నచ్చదు. తినటానికి అసలు ఇష్టపడరు. కానీ అందులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు కచ్చితంగా తినలానుకుంటారు. చూద్దాం అవి ఏంటో..

•దేహంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సమర్థంగా పని చేస్తుంది. సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్లు కూడా ఉంటాయి. సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. సలాడ్, కూర, హల్వా చేసుకుని కూడా తినవచ్చు. జుట్టు తెల్లబడిన టీనేజ్ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. తిరిగి పూర్వపు స్థితికి కూడా వస్తుంది. ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది

“ఇందులో సహజసిద్ధంగా ఉన్న మత్తు కలిగించే గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు అలసిన దేహం సాంత్వన పొందుతుంది కూడా.
•హైబీపీ ఉన్న వాళ్లు వారానికి మూడుసార్లు ఈ రసం తాగితే రక్తప్రసరణ అదుపులోకి వస్తుంది.
•గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది.
• సొరకాయ తింటే మంచి నిద్రపడుతుందట.

•ఇది సొరకాయలు పండే కాలం. హైబీపీ ఉన్న వాళ్లు
ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
•బాటిల్ గార్డ్ బీపీ గార్డ్ అని కూడా నిర్ధరణ అయింది కూడా. ఇన్ని ప్రయోజనాలు ఉన్న సొరకాయను ఈ సీజనలో బాగా లాగించేయండి. దీని ధరకూడా వేరే కాయగూరలతో పోల్చుకుంటే..చాలా చవక. తక్కువ ధరకే దొరికే మంచి
కాయ ఇది.