భారతదేశంలోని ప్రతి వంటిల్లు వైద్యాలయంతో సమానం అన్నారు మన పూర్వీకులు. మన పురాతన ఆయుర్వేదంలో సైతం మన వంటింటిని వైద్యాలయంగానే పరిగణించారు. అదే విధంగా ఏ దినుసులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనేది కూడా అందులో మనకి తెలియజేసారు. అదే విధంగా ఏవిధమైన అనారోగ్య సమస్యలు తలెత్తినా హాస్పిటల్ డాక్టర్స్ అంటూ పరిగెత్తకుండా మన ఇంట్లోని పెద్దవారు వంటింట్లోకి పరుగుతీయడం మనం గమనిస్తూనే ఉంటాం. వంట గదిలో దొరికే మసాల దినుసులనే అనారోగ్యాన్ని అరికట్టే ఔషదాలుగా వాడడం మనకు తేలిసిన విషయమే.

వెల్లుల్లిని ఒంట్లోని అదనపు కొవ్వుని కరిగించడానికి పవర్ ఫుల్ మెడిసిన్ గా పేర్కోవడం మనకు తెలిసిందే. అయితే ఈ వెల్లుల్లిని చెవి సమస్యలకు ఔషధంగా ఏ విధంగా వాడాలో చూడండి.. చెవుల సమస్య అనేది నిజానికి ఎక్కువగా శబ్దాలు వినడం, ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం, చెవులు శుభ్రంగా లేకపోవడం వలన చేవులల్లో విపరీతమైన నొప్పి వస్తుంటుంది అలాంటప్పుడు ఇలాంటి చిట్కాలు ఫాలో అవ్వండి.

వెల్లుల్లి పొట్టు తీసి చెవిలో పెట్టుకొని అలా ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఆ తరవాత తీయడం వలన 5 నుండి 7 రోజుల్లో చెవి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నల్లతుమ్మ ఆకూ మరియు బంతి పువ్వు ఈ రెండింటి రసాలుగా తాయారు చేసుకొని కొంచెం వంట నూనె మరియు 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఈ నూనెని రోజుకి 3 సార్లు చెవిలో వేసుకోవడం వలన చెవి నొప్పి సమస్య నుండి బయట పడతారు ఈ చిట్కా చెవినొప్పి సమస్యకి చక్కగా ఉపయోగ పడుతుంది.