కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది. నోటి పూత రానివ్వదు. ఇందులోని విటమిన్లు, ఐరన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తసరఫరా సవ్యంగా ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను (ఎల్డీడీఎల్) తగ్గించి మంచి కొలెస్ట్రాలను (హెచ్ డీఎల్) పెంచుతుంది.
దాంతో హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ. కొత్తిమీరలో ఉన్న ఎ- విటమిన్ కళ్లకు మేలుచేస్తే, సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇ-విటమిన్ కళ్ల కింద నలుపును పోగొడుతుంది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.

ఇందులో విటమిస్-కె విస్తారంగా ఉన్నందున రక్తం గడ్డ కట్టదు. ఆస్టియోపొరాసిస్ లాంటి వ్యాధులు రావు. ఎముకలను సురక్షితంగా ఉంచడమే కాకుండా మతిమరపును దూరం చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆకిడెంట్లు మెటబాలిజంను క్రమబద్ధం చేస్తాయి. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలూ ఉన్నాయి. ఇది నరాల వ్యవస్థను, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులకు మంచిది.

వంటల్లో కొత్తిమీర కనుక లేదంటే ఏదో వెలితిగా ఉంటుంది కదూ! కూర, చారు, పచ్చడి.. ప్రతిదాంట్లో వేసి ఘుమఘుమలు తెప్పిసాం మరి. రుచికి అంత సుమధురం మరి. అంతేనా.. ఆరోగ్యానికి మంచిదండోయ్! స్త్రీలకు వచ్చే అనేక సాధారణ అనారోగ్యాలకు కొత్తిమీరతో చెక్ పెట్టొచ్చంటే అతిశయోక్తి కాదు. నాసికకు ఆహ్లాదం కలిగించి జిహ్వకు వహ్వా అనిపించే పదార్థాల వల్ల శరీరానికి అవ సరమైన ఎంజైమ్స్ చక్కగా ఊరతాయి. దాంతోనే సగం ఆరోగ్యం చేకూరుతుంది. ఆ పని మహత్తరంగా చేస్తుంది కొత్తిమీర.

కొత్తిమీరలో ఉన్న క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరంలు దంతాలు ఎములకను దృఢంగా ఉంచుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు రోజూ కొన్ని ఆకులు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్ల జబ్బులు తగ్గుముఖం పడతాయి. ఇందులో ఉన్న పీచు జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం, మలబద్దక సమస్యలను నివారిస్తుంది. పేగులు శుభ్రంగా ఉండటంతో చిత్తం (మూడ్ బాగుంటుంది.