మీకు రోజూ ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటుందా, ఉంటే ఆ టీలో ఈ ఆకు వేసి చూడండి. ఆరోగ్యపరంగా అద్భుత ఫలితాలుంటాయి. అటు బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది. రోజూ చేసే పనుల్లోనే కొద్దిగా మార్పులు చేస్తే చాలు అద్భుతమైన ఆరోగ్యం, ఫిట్నెస్ మీ సొంతం. చాలామందికి ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే టీ తాగడం అలవాటు. ప్రతిరోజూ ఉదయం తులసి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు

1. తులసి ఆకుల టీను ప్రతిరోజూ పరిమితంగా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన అన్నీ దూరమౌతాయి. ఆరోగ్యం ఫ్రెష్ గా ఉంటుంది. ఎనర్జీ లభిస్తుంది.

2. బరువు తగ్గించేందుకు కూడా తులసి టీ అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. అయితే పరిమితి దాటకుండా నిర్ణీత మోతాదులో తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు గణనీయంగా తగ్గుతుంది.

3. తులసి ఆకుల టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమౌతుంది. కొంతమందికి స్టెస్, డిప్రెషన్ కారణంగా సరిగ్గా నిద్ర ఉండదు. ఈ పరిస్థితుల్లో డైట్లో తులసి ఆకుల టీ చేర్చుకుంటే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

4. బ్లడ్ షుగర్ సమస్య లేదా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా..తులసి టీ తాగకూడదు. గర్భిణీ మహిళలు కూడా తులసీ టీ తాగడం మంచిది కాదు. వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలి.