షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడం ఎలా?
షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడానికి జామకాయలు ఎంతగానో ఉపయోగ పడుతాయి.
• జామకాయలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవిల్స్ చెక్ చేస్తుంది. జామాలో ఉండే గ్లికామిక్ ఇండెక్స్ తొందరగా అరగనివ్వవు. దాంతో రక్తంలో గ్లూకోజ్ లెవిల్స్ ఒక్క సారిగా పెరగకుండా ఉంటాయి. ఫలితంగా బ్లడో లెవిల్స్న కంట్రోల్ చేస్తుంది. అందుకే వైద్యులు డయాబెటిస్ రోగులకి జామకాయలు ఎక్కువగా తీసుకోమని సూచిస్తారు.
• “సి” విటమిస్ కోసం అందరూ నిమ్మకాయ, నారింజ తినాలని అంటారు. కానీ జామకాయలో “సి విటమిన్” నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది.
• డయాబెటిస్ ఉన్న వారికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. జామలో రోగ నిరోధక శక్తిని అందించే కారకాలు లెక్కకి మించే ఉంటాయి.
• బరువు తగ్గాలని అనుకునే వారు కూడా జామకాయ తినవచ్చు. ఎందుకంటె జామకాయలో కేలరీస్ తక్కువగా ఉంటాయి. అత్యధిక బరువు ఉన్న వారికి కూడా షుగర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ కాబట్టి
జామ కాయ తినడం ద్వారా బరువు తగ్గి వివిధ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి సోడియం, పొటాషియం రెండూ కావాలి ఈ రెండు జామకాయలో పుష్కలంగా లభిస్తాయి.