కాలీఫ్లవర్….. ఆరోగ్య ప్రయోజనాలు!
కాలీఫ్లవర్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ, ఇది పోషకాలకు మూలం. గుండె జబ్బులు మరియు క్యాన్సర్తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలను కలిగి ఉంది. బరువు తగ్గడానికి అనుకూలమైనది. కాలీఫ్లవర్ ను ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా 8 సైన్స్ ఆధారిత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పోషకాల నిలయం: కాలీఫ్లవర్ ను పోషకాహార నిలయంగా చెప్పవచ్చు. కాలీఫ్లవర్లో క్యాలరీలు చాలా తక్కువ, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి, కాలీఫ్లవర్లో శరీరానికి కావాల్సిన విటమిస్ మరియు మినరల్లు ఉన్నాయి. కేలరీలు, ఫైబర్, విటమిస్ సి,కె, బి6, ఫోలేట్, పాంతోతేనిక్ యాసిడ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం వంటివి ఉన్నాయి.
ఫైబర్ అధికం: కాలీఫ్లవర్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక కప్పు కాలీఫ్లవర్లో 3 గ్రాముల ఫైబర్ ఉంది, ఇది మీ రోజువారీ అవసరాలలో 10% గా చెప్పవచ్చు. జీర్ణాశయంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను దీనిలోని ఫైబర్ పెంచుతుంది. ఇది వాపును తగ్గించడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, డైవర్టికులిటిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి జీర్ణక్రియ పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది.
కాలీఫ్లవర్ వంటి ఫైబర్-రిచ్ వెజిటేబుల్స్ అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి అనారోగ్యాల బారినపడే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలోని ఫైబర్ స్థూలకాయం నివారణలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. కాలీఫ్లవర్ యాంటీ ఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం. కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్, ఇన్ఫ్లమేషన్ నుండీ
కాపాడుతుంది.