వాయు కాలుష్యంతో కళ్ల సమస్యలు.. ఇవి పాటించండి..!
ఇండియాలోని పెద్ద పెద్ద నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దేశ రాజధాని దాని పరిసర ప్రాంతాలు చాలా ప్రభావితమయ్యాయి. ఢిల్లీ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉంది. కాలుష్యం కారణంగా ప్రతి లక్ష మందికి 106 మంది మరణిస్తున్నారు. తరువాత రెండవ నగరం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా. కాలుష్యంతో అనేక శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతాయి. అయితే దీని వల్ల కళ్లలో తీవ్రమైన మంటలు వస్తాయి. మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడు కొన్ని చిట్కాలని పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.
1. చల్లటి నీటితో కడగండి మీకు కళ్లలో మంటగా అనిపించినప్పుడల్లా ముందుగా చల్లటి నీటితో కడగడం మంచిది. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. కొన్నిసార్లు కాటన్ క్లాత్ సహాయంతో స్పాషింగ్ చేయడం వల్ల కళ్లకి మంచి ఫలితం ఉంటుంది.
2. రోజ్ వాటర్ మీరు రోజ్ వాటర్‌ని ఉపయోగించి కంటి చికాకు, పొడి కళ్ల సమస్యని తొలగించవచ్చు. దీని కోసం ప్రతిరోజూ కాటస్ తీసుకొని రోజ్‌వాటర్‌లో ముంచి కళ్లపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లు చల్లబడి కాలుష్యం వల్ల వచ్చే చికాకులు దూరమవుతాయి.
3. అలోవెరా జ్యూస్ కలబంద తరచుగా సౌందర్య ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తారు. కానీ మీరు దీని సహాయంతో కంటి చికాకును తొలగించవచ్చు. దీని కోసం 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ తీసుకొని ఐస్,అర కప్పు నీటిలో వేసి గ్రైండర్లో మెత్తగా చేయాలి. తర్వాత కాటన్ సహాయంతో ఈ క్రీముని కనురెప్పలపై రాసుకోవాలి.
మంచి ఉపశమనం ఉంటుంది.