అనారోగ్యాలను నివారించే దానిమ్మ రసం
దానిమ్మ రసానికి ప్రధానమైన తొమ్మిది రకాల అనారోగ్యాలను నివారించే గుణం ఉంది. ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తాగినట్లయితే..
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రీరాడికల్స్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడడనికి సహకరిస్తాయి. క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి.
రక్తనాళాలు, గుండె గదులు పటిష్టమవుతాయి. గుండె సంబంధిత రోగుల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. కరోనరీ హార్ట్ డిసీజ్ పేషెంటు మూడు నెలలపాటు రోజుకు 250 మి.లీ. దానిమ్మ రసం ఇచ్చినప్పుడు వారిలో రక్తనాళాలపనితీరు, రక్తప్రసరణ 17 శాతం వృద్ధి చెందినట్లు ఇటలీలోని హెల్త్ యూనివర్సిటీ నిర్ధారించింది.
కీళ్ల మధ్య ఉండే జిగురు వయసు పై బడే కొద్దీ తగ్గుతుంటుంది. దాంతో ఆస్టియె ఆర్ధరైటిస్ వంటి వ్యాధులు వస్తుంటాయి. దానిమ్మ రసం తీసుకుంటే జిగురు తగ్గకుండా ఉంటుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శరీరానికి అవసరమైన రసాయనాలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి..