బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని, అందుకే ఆ టైమ్ లో హెల్తీఫుడ్ తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్యులు. మానసిక, శారీరక పనితీరుపై ప్రభావం చూపే బ్రేక్ ఫాస్ట్… రోజంతా చురుకుగా ఉండేందుకు దోహదపడుతుందని చెప్తుంటారు. అయితే కొత్తగా వచ్చిన ఫాస్ట్ 800 డైట్ లో భాగంగా.. అల్పాహారంగా గుడ్లు స్వీకరిస్తే వేగంగా బరువు తగ్గడంతో పాటు శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి.
అల్పాహారంగా గుడ్లు తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. గొప్ప పోషక విలువలున్న ఎగ్ రోజంతా శకివనరుగా పనిచేస్తాయి. ఇక అందులోని తెల్లసొనలో ప్రోటీన్ కంటెంట్ తో పాటు కొవ్వు కూడా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేసే మంచి కొవ్వు కాగా చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించేందుకు, శరీరంలోని కొలెస్టాల్ స్థాయిని బ్యాలెన్స్ చేసేందుకు సాయపడుతుంది. గుడ్డులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు, చర్మ ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనకారిగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరం యొక్క సరైన పనితీ రుకు అవసరమైన పోషకాల స్టోర్ హౌజ్ గుడ్డు.