అల్లం టీ ఎక్కువగా తాగుతున్నారా? కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి…
అల్లం టీ ఎక్కువగా తాగితే గుండెల్లో మంట, విరేచనాలు, గ్యాస్ మరియు కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అల్లం టీలో యాంటీ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి రక్త స్రావాన్ని కలిగిస్తాయి. బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు కూడా అల్లం టీ తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే డయేరియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అల్లం టీ తక్కువ పరిమాణంలో తీసుకుంటే జీర్ణశక్తిని పెంచుతుంది. అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకాన్ని కలిగిస్తుంది.
మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం టీ తాగకపోతే రోజంతా హుషారు ఉండదు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యానికి మంచిదని అల్లం టీ ని ఎక్కువగా తాగుతున్నారు. టీని అయితే అల్లం టీ ఎక్కువగా తాగితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.. కొన్ని మందులు వాడేవారు అల్లం టీని ఎక్కువగా తీసుకోకూడదు.
అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. తక్కువ మోతాదులో తీసుకుంటే అల్లం టీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు