ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలను తప్పక పాటించాలి. ఇందులో మీరు చేయలేనివి, కష్టసాధ్యమైనవి ఏమీ లేవు. వాటిని అనుసరించాలన్న పట్టుదల ఉంటే.. మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అవి,

వ్యాయామం.. ఏ పని చేయాలన్న ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమౌతుంది. ఫిట్ గా చురుకు గా ఉండడానికి రోజూ వర్కవుట్ లు చేయండి. దీని కోసం ఓ గంటైన కేటాయించాలి.
ఇంటా బయటా పనులు… అలసిన మనసు సేద తీరాలంటే మీకు నచ్చిన పని కోసం రెండు గంటలు కేటాయించాలి. పుస్తక పఠనం, గార్డెనింగ్, కుటుంబం తో గడపటం.. ఈ రెండు గంటలు కేటాయించాలి.
ఆరోగ్యం కావాలా… ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. పోషక భరిత ఆహారాన్ని రోజులో మూడుసార్లు (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) తప్పక తీసుకోవాలి.

వ్యాయామం, పని… ఇలా వాటి నుంచి శరీరం, మనసుకు కాస్తంత విశ్రాంతిని కల్పించాలి. అందుకే రోజులో కనీసం నాలుగు స్వల్ప విరామాలు ఇస్తుండాలి.

ఆరోగ్యాన్ని ఇచ్చే అంశాల్లో అహారాన్ని ప్రముఖమైనదిగా చెప్పొచ్చు. పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజులో అయిదు రకాల పండ్లు. కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటి నుంచి లభించే పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తాయి.

చేసే పని మీద దృష్టి పెట్టాలంటే ఏకాగ్రత ఎంతో అవసరం. అది ధ్యానం చేయడం వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి రోజూ కనీసం అయిదారు నిమిషాలు ధ్యానం చేయండి.

జీర్నక్రియలు, జీవక్రియలు… సాఫీగా జరగాలంటే నీళ్ళు తాగడం చాలా అవసరం. రోజులో కనీసం ఏడు గ్లాసుల నీళ్ళు తాగాల్సిందే.

ఆరోగ్యం సొంతమవ్వాలంటే… ఆహరం, వ్యాయామంతో పాటు శరీరానికి తగినంత విరామం ఉండాల్సిందే. అంటే తగినన్ని గంటలు నిద్రపోవాలి. రోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు.

వందమైళ్ళ ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. అలానే ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అడుగులేయాల్సిందే. అదేనండి రోజులో దాదాపు 9000 అడుగులు వేయడం వక్క బరువు తగ్గి, హేల్తీ గా ఉండొచ్చు.