పైనాపిల్ రుచిగా ఉండటమే కాదు, పోషకాలు పుష్కలం. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం వీటికుంది. వీటివల్ల ఆరోగ్యానికెంతో మేలు కలుగుతుంది.

పైనాపిల్ లో విరివిగా యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. వ్యాధి నిరోధకశక్తి తగ్గి, రోగాల బారిన పడకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి.

వీటిలోని కొన్ని ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.

సర్జరీతో పాటు గాయాలు, స్వెల్లింగ్.. ఉంటే త్వరగా కోలుకుంటారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం వల్ల గాయాలు త్వరగా నయమవుతాయి.

బరువు తగ్గాలంటే వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. జ్యూస్, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇవి తింటే.. పంటితో పాటు కంటికీ మంచిది.

రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. గుండె సమస్యలు తగ్గించే శక్తి గుణం ఈ పండుకి ఉంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.