ఇవి తింటే మెదడు బాగా పనిచేస్తుంది, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది
శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అందులోనూ పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం బాగా తీసుకోవాలి. ముఖ్యంగా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని కూరగాయల్లో కంటికి మేలు చేసే విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. మరికొన్ని కూరగాయల్లో చర్మానికి , రోగనిరోధక వ్యవస్థకు మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.
బీట్ రూట్: ఇందులో నైట్రేట్స్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా నైట్రేట్లు మెదడుకు రక్త సరఫరా ప్రక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఫోలిక్ యాసిడ్, విటమిన్ B వంటి రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బ్రోకలీ : బ్రోకలీ, కాలీఫ్లవర్ లాంటివి మెదడుకు ఆరోగ్యకరమైన కూరగాయలు. వీటిలో విటమిన్ కె ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. గ్రీస్ లీఫీ వెజిటేబుల్స్ : ఈ కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిస్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా సహాయపడతాయి.
క్యారెట్లు: క్యారెట్లు, చిలగడదుంపలు, ఎర్ర మిరియాలు తదితర కూరగాయల్లో బీటా కెరోటిస్ ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీటాకెరోటిస్ అనేది యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరానికి ఫ్రీ రాడికల్ డ్యా మేజ్ ని ఆపుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.