ఉల్లిపాయ గురించి తప్పనిసరిగా తెలుసుకోండి
ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉండే థియోసల్ఫినేట్ రక్తం యొక్క స్థిరత్వాన్ని సరిగ్గా ఉంచటం మరియు రక్తం పలుచగా ఉండేలా చేయటం వలన గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదం చాలా రెట్లు తగ్గుతుంది. కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు శ్వాసనాళం యొక్క కండరాలపై సడలింపు ప్రభావాన్ని చూపటం వలన ఆస్తమా రోగులకు సులభంగా ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఈ సీజన్ లో వచ్చే గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది. కండ్లకలక వంటి సమస్యలను కూడా ఉల్లిపాయ తగ్గిస్తుంది. ఉల్లిపాయలో ఉండే సెలీనియం విటమిన్ ఇ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది కంటి సమస్యలను తగ్గిస్తుంది. నేచురల్ ఐ డ్రాప్స్ ఉల్లిపాయ రసం కూడా ఉంటుంది.
ఉల్లిపాయలో 25 రకాల ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణను నిరోధిస్తాయి. క్యాన్సర్, మధుమేహం మరియు గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలలో ఉండే క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది.