ఇది ఎండాకాలం రానున్న రోజుల్లో హీట్ 40 డిగ్రీలకు పైగా వెళ్లనుంది. ఇలాంటి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్ గా, చల్లగా ఉంచుకోవడం చాలా అవసరమని నిపుణులు అంటున్నారు. ఎండలోకి వెళ్ళే ముందు, చాలా రిఫ్రెష్ డ్రింక్స్ తో పాటు షర్బత్ లను తాగాలని సూచిస్తున్నారు. ఇవి శరీరానికి అనేక పోషకాలను అందించడంతో పాటు, హైడ్రేట్ గా ఉంచుతాయి. హీట్ స్ట్రోక్ ను కూడా నివారించవచ్చు.

తక్షణ శక్తి కి సిరప్ బెస్ట్: బేల్ సిరప్ శరీరానికి తక్షణ శక్తి ని ఇస్తుంది. ఇది మంచి డిటాక్స్ డ్రింక్. ఇది శరీరాన్ని చల్లగా, తాజా గా ఉంచుతుంది. బేల్ లో ఉండే టానిన్, పెక్టిన్ డయేరియా వంటి వ్యాధులకు దూరం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా విటమిన్ సి, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు బేల్ లో ఉంటాయి. ఇది మీ కడుపుని చల్లగా ఉంచుతుంది. జీర్ణక్రియ ప్రక్రియను కూడా సరిగ్గా ఉంచుతుంది. వేసవి మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి, ఖచ్చితంగా బేల్స్ సిరప్ తాగండి.

హీట్ స్ట్రోక్ నుండి కాపాడే ఆమ్ పన్నా.. పండని మామిడి పండ్లు విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటి ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, సోడియం వంటి పోషకాల మూలంగా ప్రసిద్ధి చెందాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ముందుగా పచ్చి మామిడి పండ్లను ఉడకబెట్టండి. నల్ల ఉప్పు, ఉడికించిన మామిడికాయ గుజ్జును చల్లటి నీటిలో కలిపి ఆమ్ పన్నా తయారు చేసి తాగొచ్చు. మీకు కావాలంటే, మీరు దీన్ని రోజూ తాగొచ్చు. ఇది మిమ్మల్ని హీట్స్ట్రోక్ నుంచి కాపాడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

హైడ్రేట్ గా ఉంచడం లో పెరుగు దే అగ్రస్థానం.. కాల్షియం, విటమిన్ బి-12, విటమిన్ బి-2, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పెరుగులో ఉంటాయి. వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల పొట్ట బాగా ఉంటుంది. పెరుగు, వేయించిన జీలకర్ర, నల్ల ఉప్పు కలిపి మజ్జిగ తయారు చేసుకోవచ్చు. ఇది ప్రోబయోటిక్ డ్రింక్. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

సత్తు పిండి ప్రోటీన్ కు మంచి మూలం.. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచుపదార్థాలు, ఐరన్, సోడియం, పీచు, మెగ్నీషియం వంటి పోషకాలు సత్తువలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. వర్కవుట్ చేసే వారు కూడా ప్రోటీన్ కు బదులుగా దీనిని తీసుకోవచ్చు. ఇది దేశీ సూపర్ ఫుడ్. వేసవిలో సూర్యరశ్మి వల్ల శక్తి తగ్గుతుంది. కాబట్టి 2 నుండి 3 చెంచాల సత్తు ను చల్లటి నీళ్ళలో కరిగించి నల్ల ఉప్పు, నిమ్మరసం వేసి తాగవచ్చు.

కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్స్ కి మంచి మూలం.. వేసవిలో కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. తక్కువ కేలరీల పానీయంతో పాటు యాంటి ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, ఎంజైమ్ లు, బి-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎలక్ట్రోలైట్స్ కు గొప్ప మూలం. వేసవి లో దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.