కావల్సిన పదార్థాలు:
తెల్ల నువ్వులు200 గ్రాములు, ఖర్జూరం పేస్ట్ 200 గ్రాములు, తేనె 2 స్పూన్లు, యూలకుల పొడి కొద్దిగా. మీగడ కొద్దిగా
తయారుచేసే విధానం:
ముందుగా నువ్వులను దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పొయ్యు మీద ఒక పాత్రలో మీగడవేసి ఆ తర్వాత ఖర్బూజం పేస్ట్, తేనే, యాలకుల పొడి వేయండి. కాసేపటికి వేయించిన నువ్వులు అందులో వేయండి. ఇవి పూర్తిగా కలిసేలా తిప్పండి. అందరూ ఈ ఉండను తింటే సమృద్ధిగా కాల్షియం అందుతుంది. రోజూ భోజనం తర్వాత లడ్డూను తినట
అలవాటు చేసుకుంటే చాలు మంచి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం లోపు ఎండలో వీపు భాగం ఎండతగిలేటట్లు, 10- 20 నిమిషాలు ఉండండి. నల్లటివారు.. అరగంట, గంట ఉంటే కాని విటమిన్ తయారవుతుంది. అదే తెల్లటివారికి 20నిమిషాలు చాలు.. ఎందుకంటే.. మెలనిన్ అనేది నల్లగా ఉన్నవారి చర్మంలో ఎక్కువగా ఉంటుంది. సూర్యకిరణాలు పడినా ఇది నిరోధిస్తుంది. సూర్యకరణాలు చర్మానికి చేరకుండా చేస్తాయి. అందుకే వీళ్లు ఎక్కువ సేపు ఉండాలి. పాలకంటే 13రెట్లు కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు. కాల్షియం మాత్రలు వేసుకోవాల్సిన పనిలేకుండా ఈ ఒక్క నువ్వుల ఉండను రోజుకు ఒకటి తింటే చాలు.

కాల్షియం తక్కువుగా ఉన్నవారికి, ఎముకలు బలహీనంగా ఉన్నవారికి నువ్వులు చాలు. నువ్వులతో పోలిస్తే మరే ఇతర ఆహారం కూడా సరిరాదు చాలామంది వేడిచేస్తాయిని నువ్వులు తినరు. అసలు వేడిచేసే గుణం నువ్వుల్లో లేదు. మీ శరీరంలో సరిపడా నీళ్లు లేక వేడిచేస్తుంది. నువ్వులు బాగా తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. నువ్వులను ఏ రూపంలో వాడినా వేడి చేయదు. నువ్వులను వేపి పౌడర్ గా చేసి కూరల్లో చల్లుకుని తినొచ్చు, దోరగా వేయించి ఖర్జూరంతో కలిపి లడ్డూచేసుకోవచ్చు, వీటన్నింటికంటే నువ్వులు బాగా శరీరానికి పట్టాలంటే నువ్వులను 8 గంటలపాటు నానపెట్టి విడిగా తినాలి.
నువ్వులను బాగా నమిలి తినాలి. కొంతమంది మొలకెత్తిన విత్తనాలతో కలిపి తింటారు. నువ్వులు ఏ ధాన్యాలతోనూ కలిపి తినొద్దు. గర్భీణీలు నువ్వులు తింటే గర్భం పోతుందని అని చాలామంది అంటారు. అసలు నువ్వులు గర్భిణీలకు చేసినంత మేలు వేరే ఎవరికి చేయవు. గర్భణీలకు కాల్షియం ఎక్కువగా కావాలి. గర్భణీకి ఒక రోజుకు 900 మిల్లీగ్రాములు కావాలి. అంత ఎక్కువగా కాల్షియం రావాలంటే కచ్చితంగా నువ్వుల ఉండ తినాలి
అంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు. చాలామంది అపోహలో ఉండి మంచి ఆహారాన్ని వదిలేస్తున్నారు. అందరూ నువ్వులను విరివిగా వంటల్లో వాడుకుంటే ఏజ్ పెరిగాక వచ్చే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు లాంట . సమస్యలు కూడా రావు.