జీర్ణక్రియ మెరుగు: కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమలాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి అన్ని కడుపు సమస్యలని దూరం చేస్తుంది.
ఇన్ఫెక్షన్లను నివారణ: కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటిబయాటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

కళ్లకు మంచిది: కరివేపాకు ఆకులను తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఇందులో ముఖ్యమైన పోషకమైన విటమిస్ ఎ ఉంటుంది. ఇది అంధత్వం లేదా కంటికి సంబంధించిన అనేక వ్యాధుల ప్రమాదం నుంచి కాపాడుతుంది.
డయాబెటిస్: కరివేపాకులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయి. మధుమేహ రోగులు పరగడుపున దీని ఆకులు నమిలితే చాలా మంచిది.

బరువు తగ్గుతారు:
కరివేపాకును నమలడం వల్ల బరువు తగ్గుతారు. ఇది పొట్ట కొవ్వుని కరిగిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి.