కాలీఫ్లవర్….. ఆరోగ్య ప్రయోజనాలు! 07.11.2022
కాలీఫ్లవర్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ, ఇది పోషకాలకు మూలం. గుండె జబ్బులు మరియు క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలను కలిగి ఉంది. బరువు తగ్గడానికి అనుకూలమైనది. కాలీఫ్లవర్ ను ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా 8 సైన్స్ ఆధారిత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పోషకాల నిలయం: కాలీఫ్లవర్ ను పోషకాహార నిలయంగా చెప్పవచ్చు. కాలీఫ్లవర్‌లో క్యాలరీలు చాలా తక్కువ, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి, కాలీఫ్లవర్‌లో శరీరానికి కావాల్సిన విటమిస్ మరియు మినరల్లు ఉన్నాయి. కేలరీలు, ఫైబర్, విటమిస్ సి,కె, బి6, ఫోలేట్, పాంతోతేనిక్ యాసిడ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం వంటివి ఉన్నాయి.
ఫైబర్ అధికం: కాలీఫ్లవర్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక కప్పు కాలీఫ్లవర్‌లో 3 గ్రాముల ఫైబర్ ఉంది, ఇది మీ రోజువారీ అవసరాలలో 10% గా చెప్పవచ్చు. జీర్ణాశయంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను దీనిలోని ఫైబర్ పెంచుతుంది. ఇది వాపును తగ్గించడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మలబద్దకం, డైవర్టికులిటిస్, ఇన్ఫమేటరీ ప్రేగు వ్యాధి వంటి జీర్ణక్రియ పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది.
కాలీఫ్లవర్ వంటి ఫైబర్-రిచ్ వెజిటేబుల్స్ అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి అనారోగ్యాల బారినపడే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలోని ఫైబర్ స్థూలకాయం నివారణలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. కాలీఫ్లవర్ యాంటీ ఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం. కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్, ఇన్ఫ్లమేషన్ నుండీ
కాపాడుతుంది.
క్యాలీఫ్లవర్ లో ముఖ్యంగా గ్లూకోసినోలేట్లు, ఐసోథియోసైనేట్లు అధికంగా ఉంటాయి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. దీనిలోని గ్లూకోసినోలేట్లు, ఐసోథియోసైనేట్లు పెద్ద ప్రేగు, ఊపిరితిత్తులు,
రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి ప్రత్యేకించి రక్షణ కల్పిస్తున్నట్లు అధ్యయానాల్లో తేలింది. కాలీఫ్లవర్ లో కెరోటినాయిడ్ , ఫ్లేవనాయిడ్స్, కూడా ఉన్నాయి, ఇవి క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి.
గుండె జబ్బులతో సహా అనేక ఇతర అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాలీఫ్లవర్ లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది, ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది.
కాలీఫ్లవర్ లో కోలిన్ అధికంగా ఉంటుంది, ఇది చాలా మందికి లోపించిన ముఖ్యమైన పోషకం. ఒక కప్పు కాలీఫ్లవర్ లో 45mg కోలిన్ ఉంటుంది, శరీరంలో కోలిన్ అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. కణాలను కాపాడటంతోపాటు, DNA సంశ్లేషణ చేయడం, జీవక్రియకు మద్దతు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కోలిన్ మెదడు అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు అవసరమైన న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిలో కీలకం. కాలేయంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో – సహాయపడుతుంది. తగినంత కోలిన్ తీసుకోని వారికి చిత్తవైకల్యం, అల్జీమర్స్ , నరాల సంబంధిత రుగ్మతలతో పాటు కాలేయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాలీఫ్లవర్, బ్రోకలీతో పాటు, మొక్కల ఆధారిత వనరులలో కోలిన్ లభిస్తుంది.
కాలీఫ్లవర్ లో సల్ఫోరాఫేస్ ఉంటుంది, ఇది విస్తృతంగా అధ్యయనం చేయబడిన యాంటీ ఆక్సిడెంట్. క్యాన్సర్ మరియు కణితి పెరుగుదలలో పాల్గొనే ఎంజైమ్ ను నిరోధించడం ద్వారా క్యాన్సర్ అభివృద్ధిని అణిచి వేసేందుకు సల్పోరాఫేస్ ప్రత్యేకంగా సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. దెబ్బతిన్న కణాలను నాశనం చేయడం ద్వారా సల్పోరాఫేస్ క్యాన్సర్ పెరుగుదలను ఆపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పరిశోధకలు నిర్ధారణకు వచ్చారు. సల్పోరాఫీస్ పెద్ద ప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా అత్యంత రక్షణగా తోడ్పడుతుంది.
సల్ఫోరాఫేస్ అధిక రక్తపోటును తగ్గించడంలో, ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మధుమేహం నివారణలో, మూత్రపిండాల వ్యాధి వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సల్ఫోరాఫేస్ కీలకపాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు.
ధాన్యాలు, చిక్కుళ్ళ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ; ఆహారంలో ధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఆహారాన్ని భర్తీ చేయటానికి కాలీఫ్లవర్ తీసుకోవచ్చు. తక్కువ కార్చ్ డైట్లను తీసుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ధాన్యాలు , చిక్కుళ్ళు కంటే క్యాలీఫ్లవర్ కార్బోహైడ్రేట్లలో చాలా తక్కువగా ఉంటుంది. ఒక కప్పు కాలీఫ్లవర్ లో 5 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. అదే సమయంలో, ఒక కప్పు బియ్యంలో 45 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. కాలీఫ్లవర్ కంటే తొమ్మిది రెట్లు ఉంటాయి.
కాలీఫ్లవర్ ను ఆహారంలో చేర్చడం కూడా చాలా సులభం. దీనిని పచ్చిగా కూడా తినవచ్చు. కాలీఫ్లవర్‌ను ఉడికించటం ద్వారా, సూట్లు, సలాడ్లు, వంటి వంటకాలతో కలిపి తీసుకోవచ్చు. అయితే క్యాలీఫ్లవర్ తీసుకోవడం కొందరి ఆరోగ్యానికి మంచిదికాదు. దీనిని తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్‌ను ఎక్కువ పరిమాణంలో తినకూడదు. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు, మూత్రపిండాలు మరియు థైరాయిడ్ సమస్య ఉన్న వారు దీనిని తీసుకోకపోవటమే ఉత్తమం.