కాలీఫ్లవర్ ….. ఆరోగ్య ప్రయోజనాలు!
గుండె జబ్బులతో సహా అనేక ఇతర అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాలీఫ్లవర్లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది, ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది.
కాలీఫ్లవర్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ, ఇది పోషకాలకు మూలం. గుండె జబ్బులు మరియు క్యాన్సర్తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలను కలిగి ఉంది. బరువు తగ్గడానికి అనుకూలమైనది. కాలీఫ్లవర్ ను ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా 8 సైన్స్ ఆధారిత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఫైబర్ అధికం: కాలీఫ్లవర్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక కప్పు కాలీఫ్లవర్లో 3 గ్రాముల ఫైబర్ ఉంది, ఇది మీ రోజువారీ అవసరాలలో 10% గా చెప్పవచ్చు. జీర్ణాశయంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను దీనిలోని ఫైబర్ పెంచుతుంది. ఇది వాపును తగ్గించడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, డైవర్టికులిటిస్, ఇన్ఫమేటరీ ప్రేగు వ్యాధి వంటి జీర్ణక్రియ పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది.
కాలీఫ్లవర్ వంటి ఫైబర్-రిచ్ వెజిటేబుల్స్ అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి అనారోగ్యాల బారినపడే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలోని ఫైబర్ స్థూలకాయం నివారణలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. కాలీఫ్లవర్ యాంటీ ఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం. కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్, ఇన్ఫ్లమేషన్ నుండీ కాపాడుతుంది. క్యాలీఫ్లవర్లో ముఖ్యంగా గ్లూకోసినోలేట్లు, ఐసోథియోసైనేట్లు అధికంగా ఉంటాయి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసే యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. దీనిలోని గ్లూకోసినోలేట్లు, ఐసోథియోసైనేట్లు పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి ప్రత్యేకించి రక్షణ కల్పిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. కాలీఫ్లవర్లో కెరోటినాయిడ్, ఫ్లేవనాయిడ్స్, కూడా ఉన్నాయి, ఇవి క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి.
పోషకాల నిలయం: కాలీఫ్లవర్ ను పోషకాహార నిలయంగా చెప్పవచ్చు. కాలీఫ్లవర్లో క్యాలరీలు చాలా తక్కువ, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి, కాలీఫ్లవర్లో శరీరానికి కావాల్సిన విటమిస్ మరియు మినరల్లు ఉన్నాయి. కేలరీలు, ఫైబర్, విటమిస్ సి,కె, బి6, ఫోలేట్, పాంతోతేనిక్ యాసిడ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం వంటివి ఉన్నాయి.