2013వ సంవత్సరంలో ఒస్లో యూనివర్శిటీ హాస్పటల్ నార్వే వారు బీపీ గురించి ఈ ఫ్రూట్ మీద పరిశోధన చేశారు. రోజుకు మూడు కివి ఫ్రూట్ ను రెండు నెలలు తింటే.. బిపీలో సిస్టోలిక్, డయాస్టోలిక్ 20mm hg తగ్గుతుందని అని తెలిపారు. ఇందులో పొటాషియం 350 మిల్లీగ్రాముల వరకూ ఉంది..దీనివల్ల రక్తనాళాలు స్మూత్ అవుతున్నాయని 108 మంది మీద పరిశోధన చేసి ఇచ్చారు.

మలబద్ధకం..ఈరోజుల్లో 100లో 95 మందికి ఈ సమస్య ఉంటుంది. అసలు చాలామందికి మలబద్ధకం సమస్య ఉంటుందని కూడా గుర్తించరు. వెళ్తారు కానీ.. ఎంతో కొంత పనివుతుంది. కానీ కంప్లీట్ గా అవ్వదు. అది కూడా అతికష్టం మీద. కివి ఫ్రూట్ లో ఉండే ఫైబర్, కొన్ని పోషకాలు ప్రేగుల్లో కదలికలు బాగా పెంచి..మోషన్ స్మూత్ గా అయ్యేట్లు చేస్తాయని యూకేవారు 2019లో పరిశోధన చేసి నిరూపించారు. రోజుకు పొద్దున రెండు, సాయంకాలం రెండు కివి ఫ్రూట్స్ ను మూడు రోజులు తింటేనే మలబద్ధకం తగ్గతుందని తెలిపారు.

కివి ఫ్రూట్ లో ఏమైన పోషకాలు ఉన్నాయా? మనం వాళ్లు వీళ్లు చెప్పినవి కాకుండా..సైంటిఫిక్ గా ఈ కివి ఫ్రూట్స్ తినటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం.
100 గ్రాముల కివి ఫ్రూట్ లో ఉండే పోషకాలు:
82 గ్రాములు నీటి శాతం ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉన్నవన్నీ ఆరోగ్యానికి మంచివే. పిండిపదార్థాలు 14 గ్రాములు, మాంసకృతులు 1 గ్రాము, ఫ్యాట్ 0.5 కాలరీలు 61 శాతం, ఫైబర్ 3 గ్రాములు, విటమిస్ C 93 మిల్లీగ్రాములు. బత్తాయి, కమలా, నారింజతో పోలిస్తే డబుల్ ఉంది. రక్షణ వ్యవస్థకు విటమిన్
సీ చాలా అవసరం.

కివిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంది. విటమిన్ E కూడా ఎక్కువగానే ఉంది. ఈ రెండిటి కాంబినేషన్ ఉండటం వల్ల స్కిస్ కింద ఉండే కొలాజన్ అనే మెష్ హెల్తీగా తయారుచేసి..అది డామేజ్ అవ్వకుండా రక్షిస్తుంది. దీనివల్ల స్కిస్ ముడతలు రాకుండా కాపాడుతుందని సైంటిఫిక్ గా ప్రూప్ చేశారు. ఇందులో ఉండే AE, AC అనే పవర్ ఫుల్ యాంటిఆక్సిడెంట్ వల్ల జలుబు, దగ్గు రాకుండా కాపలాకాస్తుందట. 2009వ సంవత్సరంలో కివి ఫ్రూట్ మీద థైవాన్ వారు పరిశోధన చేసి ఏం చెప్పారంటే.. ఈ కివి ఫ్రూట్ ను రోజుకు 100 గ్రాములు చొప్పున రెండు నెలలు తీసుకుంటే 30శాతం ట్రైగ్లిజరయిడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతున్నాయని నిరూపించారు.