కేన్సర్ నుంచి రక్షణ
బ్రకోలి :
బ్రక్కోలి ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటోంది. ఇందులో ఉండే ఇండోల్ 3 కార్బినోల్ ఈస్ట్రోజెన్ జీవక్రియను మార్చగలదు. తద్వారా బ్రెస్ట్ ట్యూమర్ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది. హార్మోన్లపై ఆధారపడిన బ్రెస్ట్, సర్వికల్, ప్రొస్టేట్ కేన్సర్ల నుంచి రక్షణ కోసం బ్రకోలిని తీసుకోవాలి.
బ్లూబెర్రీ :
బ్లూబెర్రీలలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. బ్రెస్ట్ కేన్సర్ నుంచి రక్షణకు ఇవి సాయపడతాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ బ్రెస్ట్ కేన్సర్ విస్తరించకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కు కేన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.
పసుపు :
పసుపు ఆరోగ్య ప్రదాయనిగా ఎక్కువ మందికి తెలుసు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పసుపునకు ఉన్నాయి. శరీరంలో వాపును (ఇన్ఫ్లమ్మేషన్) కూడా తగ్గిస్తుంది. కేన్సర్ కణాలను పసుపు నిరోధిస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, లంగ్, స్కిన్ కేన్సర్ల నుంచి రక్షణగా దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
అవిసె గింజలు:
అవిసె గింజలను ఫ్లాక్స్ సీడ్స్ గా చెబుతారు. వీటిల్లో ఉండే లిగ్నాస్ బ్రెస్ట్ కేన్సర్ వంటి ఈస్ట్రోజెస్ ఆధారిత కేన్సర్ల నుంచి రక్షణ ఇస్తాయి. అవిసె గింజలు, అవిసె ఇ నూనెలో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కేన్సర్ నుంచి రక్షణగా నిలుస్తాయి.
పుట్టగొడుగులు:
మష్రూమ్స్ లో యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. విటమిన్ బీ3, విటమిన్ బి2 ఎక్కువగా లభిస్తాయి. మష్రూమ్స్ ను తీసుకోవడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందని దక్షిణ కొరియా అధ్యయనం ఒకటి తేల్చింది.