కొత్తిమీర కమ్మదనం
వంటల్లో కొత్తిమీర కనుక లేదంటే ఏదో వెలితిగా ఉంటుంది కదూ! కూర, చారు, పచ్చడి.. ప్రతిదాంట్లో వేసి ఘుమఘుమలు తెప్పిసాం మరి. రుచికి అంత సుమధురం మరి. అంతేనా.. ఆరోగ్యానికి మంచిదండోయ్! స్త్రీలకు వచ్చే అనేక సాధారణ అనారోగ్యాలకు కొత్తిమీరతో చెక్ పెట్టొచ్చంటే అతిశయోక్తి కాదు. నాసికకు ఆహ్లాదం కలిగించి జిహ్వకు వహ్వా అనిపించే పదార్థాల వల్ల శరీరానికి అవ సరమైన ఎంజైమ్స్ చక్కగా ఊరతాయి. దాంతోనే సగం ఆరోగ్యం చేకూరుతుంది. ఆ పని మహత్తరంగా చేస్తుంది కొత్తిమీర.
ఇందులో విటమిన్-కె విస్తారంగా ఉన్నందున రక్తం గడ్డ కట్టదు. ఆస్టియోపొరాసిస్ లాంటి వ్యాధులు రావు. ఎముకలను సురక్షితంగా ఉంచడమే కాకుండా మతిమరపును దూరం చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆకిడెంట్లు మెటబాలిజంను క్రమబద్ధం చేస్తాయి. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలూ ఉన్నాయి. ఇది నరాల వ్యవస్థను, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులకు ” మంచిది.
కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది. నోటి పూత రానివ్వదు. ఇందులోని విటమిన్లు, ఐరన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తసరఫరా సవ్యంగా ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను (ఎల్డీఎల్) తగ్గించి మంచి కొలెస్ట్రాలను (హెచ్ డీఎల్) పెంచుతుంది. దాంతో హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ. కొత్తిమీరలో ఉన్న ఎవిటమిన్ కళ్లకు మేలుచేస్తే, సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇ-విటమిన్ కళ్ల కింద నలుపును పోగొడుతుంది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.
కొత్తిమీరలో ఉన్న క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరంలు దంతాలు ఎములకను దృఢంగా ఉంచుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు రోజూ కొన్ని ఆకులు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్లజబ్బులు తగ్గుముఖం పడతాయి. ఇందులో ఉన్న పీచు జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం, మలబద్దక సమస్యలను నివారిస్తుంది. పేగులు శుభ్రంగా ఉండటంతో చిత్తం (మూడ్) బాగుంటుంది.
శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్-బి6 కూడా ఒకటి.
దానివల్ల శరీర పనితీరు మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటారు. అదే B మ విటమిన్-బి6 లోపిస్తే? ఆరోగ్యానికి నష్టం. ఎలా అంటే.. విటమిన్ బి6 తక్కువైతే…
• శరీరంలో ప్రోటీన్స్, మంచి ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఎర్ర రక్త కణాలు, మెటబాలిజం ఉత్పత్తికి విటమిన్-బి6 అవసరం. • గర్భిణుల్లో విటమిన్-బి6 తగ్గితే ఎనీమియాతో పాటు, పుట్టబోయే పిల్లలు శారీరక లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది.
శరీరంలో విటమిన్-బి6 తగ్గడం వల్ల కంటి సమస్యలు వస్తాయి. నాలుక, పెదవులు పొడిబారడం, పగలడం కూడా విటమిన్-బి6
లోపానికి కారణాలే. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు, నోటిపూత విటమిన్ బి6 తక్కువైతే… కూడా వస్తాయి.
విటమిన్-బి6 తగ్గితే ఏ పని చేయకపోయినా ఎప్పుడూ బద్దకంగా, అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. చేతులు, పాదాల్లో గుచ్చినట్టు అనిపిస్తుంది. డిప్రెషన్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
తినాల్సినవి: * విటమిన్-బి6 లోపించిన వాళ్లు చేపలు, మటన్, క్యారెట్, అవకాడో, పిస్తా పప్పు ఎక్కువగా తినాలి.
• తోటకూర, బచ్చలి కూర, పుదీన, పాల కూరల్లో కూడా విటమిన్-బి6 విటమిన్ బి6 తక్కువైతే..
పుష్కలం. పచ్చి శనగల మొలకలు, ఎండు మిర్చి, అన్ని రకాల పప్పులు, అరటి పండ్లు తినాలి. •ఇవి తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, కంటి సమస్యల వంటివి రాకుండా చూసుకోవచ్చు. ఇవి నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.