కొలెస్ట్రాల్ శరీరంలోని ప్రతి భాగంలో ఉంటుంది, ఇది శరీరంలో విటమిస్ డి, హార్మోన్లు, పిత్తాన్ని తయారు చేస్తుంది. అయితే కొలెస్టాల్లో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి మంచి కొలెస్ట్రాల్ మరొకటి చెడు కొలెస్ట్రాల్. చేడు కొలెస్ట్రాల్ పెరగడం అనేది చాలా మందిని ఆందోళనకు గురిచేసే వ్యాధి. చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి, ఆహారాన్ని మార్చడం అవసరం. చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో లెమన్ గ్రాస్ ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు అనేక వ్యాధులకు చికిత్స చేస్తాయి.