ఖర్జూరంతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు
ఖర్జూరం.. ఆహా ఆ పండ్లను చూడగానే నోటిలో నీళ్ళూరుతాయి. ఖర్జూరం పంచదారలా ఎంతో తియ్యగా రుచిగా ఉంటుంది. అయితే నోటికి మంచిగా అనిపించేవి.. ఒంటికి మంచివి కాదు అంటారు పెద్దలు. కానీ ఖర్జూరం విషయంలో మాత్రం ఇది తప్పని చెప్పాలి. ఇది ఆరోగ్యదాయిని కూడా. ఖర్జూరంలోని ఫ్రక్టోజ్, డెక్స్ ట్రోజ్ వంటి సరళ పిండి పదార్థాలు తిన్న వెంటనే శక్తిని ఇస్తాయి. ఖర్జూరంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ పెంపొందించడమే కాకుండా… రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే టానిన్లనే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ ఫెక్షన్లు, వాపు, రక్తస్రావ నివారణకు తోడ్పడతాయి. ఎండిన ఖర్జూర పండ్ల వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ఖర్జూర పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ఖర్జూర పండ్లలో ఉండే విటమిన్-ఏ, బి… రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటి సమస్యలకు ఖర్జూలం గుజ్జు మంచి మెడిసిన్ ఖర్జూరంలో ఉండే బీటా కెరటిన్, ల్యుటీన్, జియాగ్జాంతిన్ అనే రచికారక యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకుంటాయి.
ఇలా పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ ఇస్తాయి. జియాగ్జాంతిన్ వృద్ధాప్యంలో రెటీనాలోని మాక్యులా క్షీణించకుండానూ కాపాడుతుంది.
ఆ కణాలకు పొటాషియం చాలా అవసరం ఇది ఖర్జూరంలో సరిపడినంత ఉంటుంది. ఒంట్లో ద్రవాలు, గుండెలయ, రక్తపోటు నియంత్రణలోనూ పొటాషియం పాలు పంచుకుంటుంది. ఇలా గుండె, మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు మార్పులను చేస్తుంది. ఐరన్ లోపంతో బాధపడే వారికి ఖర్జూరం చాలామంచిది.

మలబద్దకం వేదిస్తుంటే పాలల్లో కొన్ని ఎండు ఖర్జూరాలను వేసి మరగబెట్టి నిద్రపోయే ముందు తాగితే మంచిది. ఖర్జూరంలో ఉండే సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మెగ్నీషియం ఓసీరియో ఫోసిస్ నివారిస్తాయి.
ఖర్జూరంలో ఫంగస్, బ్యాక్టీరియా, వైరసన్ను ఎదుర్కొనే గుణాలు ఉన్నాయి. పీచు, ఫెనాల్ తరగతి ఆమ్లాలు సైతం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుండెజబ్బుల నివారణకు, రోగనిరోధకశక్తి సక్రమంగా పనిచేయటానికి ఖర్జూరం సాయపడుతుంది. డయాబెటీస్, గుండె, ఇతరాత్ర వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా వైద్యుల సూచన తర్వాతే ఖర్జూర పండ్లను తీసుకోవాలి.