కింది నుంచి గ్యాస్ పోవడం చాలామందిని ఇబ్బంది పెట్టే అంశం. ఎవరికీ చెప్పుకోలేని బాధ కూడా. అయితే ‘లో-ఫుడ్ మ్యాప్’ ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. ఆ ఆహారం ఏమిటో తెలుసుకునే ముందు అసలు ‘లో-పుడ్ మ్యాప్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

‘ఫర్మెంటబుల్ ఆలిగో శాకరైడ్స్’, ‘డై-శాకరైడ్స్’, ‘మోనో-శాకరైడ్స్’, ‘పాలీయాల్స్’ అనే రకాల ఆహారాల ముందు మాటలను కలిపి అవి ఓ సంక్షిప్తాక్షరం(ఏక్రోనిమ్)గా రూపొం దించడం వల్ల ఏర్పడిన పదమే ‘ఫుడ్ మ్యాప్’. ఆయా పదార్థాలు తక్కు వగా ఉండే ఆహారమే ‘లో-ఫుడ్ మ్యాప్’ న్యూట్రిషన్.

వీటిని బట్టి తీసు కోవాల్సిన, తీసుకోకూడని పదార్థాలేమిటో చూద్దాం. ప్రధానాహారాలుగా వరి అన్నం, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్, పండ్లలో అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ, వెజిటబుల్స్ లో క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలుగడ్డ, పాలకూర, టొమాటో; ప్రోటీన్లలో చికెన్, ఫిష్, నట్స్ లో పల్లీలు, వాల్నట్స్ వంటివి తీసుకోవాల్సిన పదార్థాలు.

అలాగే తీసుకోకూడని పదార్థాల్లో పాస్తా, కేక్ బిస్కెట్స్, పండ్లలో పియర్, ప్రూన్, పీచ్, చెర్రీస్, వెజిటబుల్స్ లో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్ రూట్స్, ప్రోటీన్స్ లో బీన్స్, సోయాబీన్స్ వంటివి. వీటి నుంచి దూరంగా ఉండాలి.

ఈ తరహా ఆహారాలలో తీసుకోవల్సినవి తీసుకుంటూ, మిగతావాటికి దూరంగా ఉండటం వల్ల కిందినుంచి గ్యాస్ పోయే సమస్యతో పాటు ఐబీ ఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది.