మనకు ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకోవడం ఇప్పుడు మామూలు అలవాటుగా మారిపోయింది. బలమైన కారణాలతోనే ఈ టీ కి మనం అలవాటు పడ్డాం. దీనిని తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించవచ్చనో లేక ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుందనో గ్రీన్ టీని తాగుతున్నవారు ఉన్నారు.

అయితే ఈ గ్రీన్ టీతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు డాక్టర్స్.. హెల్త్ డ్రింక్స్, గ్రీన్ టీ విషయానికి వస్తే ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండి, అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

1. మెదడు పనితీరులో సహాయపడుతుంది: వ్యాధులను నివారించడం, కణాలను రక్షించడమే కాకుండా, గ్రీస్ టీ మనస్సుకు కూడా మేలు చేస్తుంది. దీనిలోని కెఫీస్ మనలో ఉత్తేజాన్ని నింపుతుంది. అంతేకాదు ఇది మెరుగైన మానసిక స్థితిని, జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ టీలో అమైనో ఆమ్లం L-థియనైస్ కూడా ఉంటుంది, ఇది కెఫిన్స్తో కలిసి పని చేస్తుంది.

2. హృదయ వ్యాధులను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది: గ్రీన్ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అలాగే LDL కణాలను కాపాడుతుంది. ఈ టీని రోజూ తీసుకునేవారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధనలు నిరూపించాయి.

3. క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది: క్యాన్సర్ ఇప్పటికీ మానవ జీవితానికి పెద్ద ముప్పుగా మారిపోయింది. ఇది యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచడంలో సహకరిస్తుంది. రొమ్ము, కొలొరెక్టల్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి హానికరమైన క్యాన్సర్ వ్యాధులను తగ్గించడంలో ఈ టీ సహాయపడుతుంది.

4. వృద్ధాప్య వ్యాధుల నుండి రక్షిస్తుంది: గ్రీన్ టీ మెదడును వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది. ఇందులోని కాటెచిన్ ఆర్గానిక్స్ మెదడును రక్షించడంలో సహాయపడుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది, దీనివల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

5. వివిధ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: గ్రీస్ టీలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నిరోధించే ఆర్గానిక్ లు ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో, ఇన్ఫ్లుఎంజా వంటి ఇన్ఫెక్షన్లు లేదా వైరస్లు తగ్గించడంలో ఈ కాటెచిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తా

6. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: మధుమేహం ఇప్పుడు అందరిలో కామస్ గా వచ్చ వ్యాధి. దీనికి చక్కెర స్థాయి పెరగడం కూడా ఒక కారణం. గ్రీన్ టీ ఇన్సులిన్ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది అని పరిశోధనలు చెపుతున్నాయి.

7. ఊబకాయాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది: గ్రీన్ టీ బరువు పెరగడాన్ని తగ్గించడంలో, పెరుగుతున్న ఊబకాయం సమస్యను అధిగమించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.