చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా? Part-1
కొలెస్టాల్ మీ రక్తంలో కనిపించే మైనపు, కొవ్వు పదార్థం. ఇందులో – రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ దీనీనే హెడీఎల్అ ని, చెడు కొలెస్టాల్ దీనిని ఎల్డీఎల్ అని పిలుస్తారు. టైగ్లిజరైడ్స్ | రక్తంలో కనిపించే మరొక రకమైన కొవ్వు, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. చెడు కొలెస్టాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడానికి తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అనుగుణమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు ,చక్కెరను పరిమితంగా తీసుకోవాలి. తృణధాన్యాలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవటం ద్వారా చెడు కొవ్వులను తగ్గించుకోవచ్చు. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 45 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ప్రతి మూడు మాసాల కొకసారి కొలెస్టాల్ పరీక్షలు చేయించుకోవటం మంచిది. ప్రస్తుత తరుణంలో మనలో చాలా మంది శరీరంలో అధిక కొలెస్టాల్ తో జీవిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఎల్ డీఎల్ స్టాల్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచడానికి కారణమవుతుంది. అయితే హెచ్ డీఎల్ కొలెస్టాల్ మనల్ని రోగాల బారి నుండి కాపాడుతుంది. మంచి ఆహార అలవాట్లు, నిరంతర వ్యాయామం, శరీర బరువుని అదుపులో ఉంచుకోవడం, ఇలాంటి వాటితో మన దేహంలో తయారయ్యే అధిక కొవ్వులను నియంత్రించవచ్చు. ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడం మంచిది. కూరగాయలు, చిక్కుళ్ళు, పండ్లు, తృణధాన్యాలు, గింజలు మరియు విత్తనాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలను ఎక్కువగా తినడం గుండె ఆరోగ్యానికి మంచిది. కూరలలో మాంసానికి బదులుగా పప్పు ఉపయోగించండి.