డ్రాగన్ ఫ్రూట్… పోషకాల ఖజానా!
జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఖనిజాలు మెండుగా ఉంటాయి. పోషకాలు పుష్కలం. దీని నుంచి అందే కెలొరీలు అత్యల్పం. మిగతా పండ్ల మాదిరే దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఈ పండు ఇన్సులిన్ రెస్టి సెన్ను పెంచుతుంది. దీనిలోని రసాయనాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు దీని గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుడ్ కొలెస్టాలను పెంచుతాయి.
గులాబీ రంగులో అరచేతిలో పట్టేంత ఈ పండు ఆకర్షణీయంగానే కాదు రుచిగానూ ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… పండు పైన గులాబీ రంగులో.. లోన తెల్లని గుజుతో.. నల్లని చిన్న విత నాలతో ఉంటుంది. ఈ పండులో మూడు రకాలుంటాయి. కప్పు గుజ్జు నుంచి దాదాపు 186 కెలొరీలు అందుతాయి. పిండిపదార్థాలు- 29 శాతం, పీచు- 1 గ్రా., మాంసకృత్తులు- 3 గ్రా., ఇనుము- 8 శాతం ఉంటాయి. కొవ్వులు అస్సలుండవు. జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఖనిజాలు మెండుగా ఉంటాయి. పోషకాలు పుష్కలం. దీని నుంచి అందే కెలొరీలు అత్యల్పం. మిగతా పండ్ల మాదిరే దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
ఈ పండు ఇన్సులిన్ రెస్టి సెన్ను పెంచుతుంది. దీనిలోని రసాయనాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు దీని గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుడ్ కొలెస్ట్రాలను పెంచుతాయి. సమృద్ధిగా ఉండే పీచు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువును నియంత్రిస్తుంది. ఈ పండులోని పిటయా అనే పోషకం రోగనిరోధకతను పెంచుతుంది. విటమిన్ సి, కెరొటినాయిడ్లు ఇన్ ఫెక్షన్స్ తో పోరాడతాయి. ఈ పండులోని మెత్తటి భాగాన్ని ముక్కలుగా చేసుకుని తినొచ్చు. దీని గుజ్జుతో స్మూథీలు చేసుకోవచ్చు. సలాడ్ లా, పెరుగులోనూ వేసుకోవచ్చు.