తక్షణ శక్తికి సపోటా
ఈ పండులోని సుగుణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచి, ఫ్రీరాడికలను నాశనం చేస్తాయి.
డయేరియాకు మందుగా పనిచేస్తుంది. పేగు ఆరోగ్యానికి మంచిది. బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షనన్ను తగ్గిస్తుంది.
యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు మెండుగా ఉంటాయి.
సపోటా పండు చూడగానే నోరూరుతుంది. తియ్యటి గుజ్జు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇది రుచికరమే కాదు బోలెడు పోషకాలను అందిస్తుంది. అవేంటంటే…
ఈ పండులో ఇనుము, పోటాషియం, కాపర్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, పీచు పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల సపోటాల నుంచి 98 కెలొరీల శక్తి లభిస్తుంది
అధిక మొత్తంలో కెలొరీలుండే ఈ పండు తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చూస్తుంది.
ఈ పండులో విటమిన్ ఎ మెండుగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధకతను పెంచే విటమిన్-సి పుష్కలం.