తిప్ప ఆకుతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
ఆహారాలు కలుషితంగా ఉండడం వల్ల వైరల్ ఫీవర్, జలుబు, ఇతర వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తిప్ప ఆకు డికాషన్ తీసుకోవాలి. ఈ డికాషన్ క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
తయారీ విధానం:
1. ముందుగా ఒక పాత్రలో నీరు పోసి తిప్ప ఆకులను వేసి వేడి చేయాలి. 2. ఇప్పుడు ఈ నీటిలో పసుపు పొడి, నల్ల మిరియాల పొడి వేసి మరిగించాలి. 3. తర్వాత దాల్చిన చెక్క, అల్లం తురుము, తులసి ఆకులను అందులో వేయాలి 4. సుమారు 5 నిమిషాల పాటు మరిగించాలి.
5. ఇప్పుడు ఒక పాత్రలో నీటిని ఫిల్టర్ చేయండి.
6. రుచికి అనుగుణంగా తేనె వేసి కలపాలి.
7. ఈ డికాషన్ వారానికి 2-3 రోజులు తప్పనిసరిగా తాగాలి.
తిప్ప ఆకు డికాషన్ తయారీకి కావలసిన పదార్థాలు: > తిప్ప ఆకు
> 1 స్పూన్ పసుపు పొడి
> 2 అంగుళాల అల్లం
> 7-8 తులసి ఆకులు
> 1 అంగుళం దాల్చిన చెక్క
> 1/4 స్పూన్ నల్ల మిరియాలు పొడి
> 2 స్పూన్ తేనె & 2 కప్పుల నీరు