పోషకాలతో నిండిన ఫుడ్ తినకపోడం, లైఫ్ స్టయిల్ ఛేంజెస్ వల్ల కొందరిలో థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. దాంతో మెటబాలిజం మీదనే కాకుండా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతోంది. థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని సూపర్ ఫుడ్స్ తినాలి.

గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువ ఉంటుంది. శరీరం పోషకాలు, విటమిన్స్న గ్రహించేందుకు జింక్ చాలా అవసరం. అంతేకాదు, థైరాయిడ్ హార్మోన్ల తయారీ, వాటి బ్యాలెన్స్ కి కూడా జింక్ కావాలి. అందుకే రెగ్యులర్‌గా గుమ్మడి గింజలు తింటే థైరాయిడ్ సమస్యలు రావు.
బీన్స్ లో ఫైబర్ ఉంటుంది. ఇది థైరాయిడ్ సమస్యల్లో ఒకటైన కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి నూనెతో వండినవి తిన్నా థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. కోకొనట్ లో మీడియం ఛెయిన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం ఛెయిన్ ట్రైగ్లిసరాయిడ్స్ ఉంటాయి. ఇవి మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి.