నువ్వులతో ఆరోగ్యం
నిండుగా నువ్వులు అద్దిన అరిసెల ప్రత్యేకత వేరు. జంతికల్లో కాసిన్ని చేర్చితే ఆ రుచి అమోఘం. నువ్వుండల గురించి ఇక చెప్పేదేముందినువ్వులు రుచిని మాత్రమే కాదు అపారమైన పోషాకలన్నీ అందిస్తాయి.
రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వండాలి, వారికి కొలెస్ట్రాల్ తోపాటు, ట్రైగ్జిరాయిడ్లు అదుపులో ఉంటాయట. ఫలితంగా గుండెజబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది. నువ్వులలో మేలు చేసే కొవ్వులు ఉండటమే ఇందుకు కారణం.
మామూలు నువ్వులతో పోలిస్తే వేయించినవి తింటే మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయట. ముఖ్యంగా కండరాల బలానికీ, హార్మోన్లు చురుగ్గా ఉండటానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.
మెగ్నీషియం పుష్కలంగా ఉండే నవ్వులు గుండె ఆరోగ్యానికి మేలుచేస్తాయి నల్ల నువ్వులని రోజుకి ఓ రెండు గ్రాములు తీసుకున్నా గుండె కవాటాలు మూసుకు పోయే సమస్య కొంతవరకూ ఉపశమిస్తుంది.