నేత్రాలకూ వ్యాయామం అవసరమే!
బయటకు వెళ్లే వీలులేక, ఇంట్లోనే కూర్చొని డిజిటల్ తెరలు చూసి చూసి కళ్లు బాగా అలసిపోయి ఉంటాయి. అలాంటి అలసిన నేత్రాలకు ఈ వ్యాయామంతో ఉపశమనం కలుగుతుంది.
బ్లింక్ స్లో : కుర్చీలో కూర్చొని, మెడ, తల నిటారుగా పెట్టండి. భుజాలు రిలాక్స్డ్ మోడ్లో ఉండాలి. ఎదురుగా ఉన్న ఖాలీ గోడను చూడండి. ఓ క్షణం కళ్లు మూసి, తెరవండి. ఇలా పది లెక్కన రోజుకు రెండుసార్లు చేయాలి. నిటారుగా కూర్చొని, భుజాల రిలాక్స్ గా ఉంచండి. మెడ, తల కదిలించ కుండా కను బొమ్మలను కుడివైపు తిప్పండి. నిదానంగా సీలింగ్ వైపు, ఎడమ వైపు, కిందకి కదిలించండి. ఇలాగే వ్యతిరేక దిశలో కూడా చేయండి.
నిదానంగా సీలింగ్ వైపు, ఎడమ వైపు, కిందకి కదిలించండి. ఇలాగే వ్యతిరేక దిశలో కూడా చేయండి ఇలా పది సెట్ల చొప్పున రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కుడి చేతి నాలుగు వేళ్లనూ మూసి, చూపుడు వేలిని మీ కళ్లకు పది అంగుళాల దూరంలో ఉంచండి. ఆ వేలు పైనే పూర్తి దృష్టి పెట్టండి. నెమ్మదిగా వేలిని పక్కకు కదిలించండి. కానీ మీ చూపు మారకూడదు. అదే డైరెక్షన్లో దూరంగా ఉన్న ఏదో ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించండి. ఇప్పుడు మళ్లీ చూపుడు వేలుపై దృష్టి మరల్చండి. నిదానంగా వేలిని కళ్ల దగ్గరకు తీసుకువెళ్లండి. మరలా దూరంగా ఉన్న వస్తువు చూడండి. ఇలా మూడుసార్లు చేయాలి.