నోటి పుండ్లు ఎందుకు వస్తాయి?
పెదవుల లోపల, నాలుక మీద తలెత్తే నోటి పుండ్లతో చెప్పలేనంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇవి తరచుగా వేదిస్తున్నాయంటే పరిస్థితిని తీవ్రం గానే పరిగణించి, మూల కారణాలను సరిదిద్దుకోవాలి.
నోటి పుండ్ల ప్రధాన కారణం నోటి శుభ్రత పాటించకపోవడమే! అలాగే మానసిక ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం తలెత్తిన నోటి పుండ్లు వేధిస్తాయి. కాబట్టి, నోరు శుభ్రంగా ఉంచుకోవడం తో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. విటమిన్ల లోపం తలెత్తకుండా సమతులాహారం తీసుకోవాలి. మాంసకృతులు, పీచు పదార్ధం ఎక్కువగా తీసుకోవాలి. తాజా పళ్ళతో అవసరమైన విటమిన్లు అందుతాయి. నోటి పుండ్లు తగ్గే వరకు మల్టీ విటమిన్ మాత్రలు వాడటం మేలు.