ఇప్పుడు మార్కెట్లో పచ్చి బటానీలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చిక్కుడు జాతికి చెందిన వీటిలో ప్రొటీన్లు, విటమిన్-ఎ,కె తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి ఆరోగ్యాన్ని పెంచుతాయి. పచ్చి బటానీలు తింటే లాభాలివి…

వీటిలోని ల్యూటిన్, జియాగ్జాంతిన్ అనే కెరోటినాయిడ్స్ కళ్లని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాటరాక్ట్ బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాదు కంప్యూటర్, ల్యాప్ టాప్, ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా కళ్లు దెబ్బతినకుండా చూస్తాయి.

పచ్చి బటానీలోని ఫైబర్.. ఫుడ్ ఈజీగా అరిగేలా చేస్తుంది. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. వీటిలోని ‘కౌమెస్టోల్’ అనే ఫైటో ఈస్ట్రోజన్ స్టమక్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది.

ఇందులోని ఒమెగా-3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ చేరకుండా చూస్తాయి. పచ్చి బటానీలోని పొటాషియం, మెగ్నీషియం, హై బీపీని తగ్గిస్తాయి.

ఈ బటానీలో సి, ఇ విటమిన్లు, జింక్, కాటెచిన్, ఎపికాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

ఎ, బి విటమిన్లు, ఫెరూలిక్, కౌమెస్టోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ లక్షణాల్ని తగ్గిస్తాయి. దాంతో గుండె జబ్బులు, డయాబెటిస్, ఆర్థరైటిస్ ముప్పు నుంచి కాపాడతాయి.