పాప్ కార్న్.. అందరూ తినడానికి అమితంగా ఇష్టపడే స్నాక్ ఐటమ్. ముఖ్యంగా థియేటర్ లో సినిమా చూసేటప్పు చాలామందికి ఇది చేతిలో ఉండాల్సిదే. ఎక్కువగా టైంపాస్ కోసం తీసుకునే ఈ స్నాక్ ద్వారా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు సైతం కలుగుతాయంటున్నారు నిపుణులు. జొన్నల నుంచి తయారయ్యే ఈ పాప్ కార్న్ లో ఉండే పీచు, పాలిఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం .. మొదలైనవన్నీ ఆరోగ్యా నికి ఉపకరించేవేనట!
కొవ్వు స్థాయులు తగ్గిస్తుంది…. పాప్ కార్న్ లో ఉండే పీచు పదార్థాలు రక్తనాళాలు, ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొవ్వును సమర్థంగా తగ్గిస్తాయి. తద్వారా శరీరంలోని కొవ్వు స్థాయుల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఫలితంగా హృద్రోగ సంబంధిత సమస్యలు తలెత్తే ఆవకాశాలు చాల వరకు తగ్గిపోతాయి.

చక్కెర స్థాయులను నియంత్రిస్తూ… మన శరీరంలో తగినంత పీచు పదార్థాలు ఉన్నప్పుడు అవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులను క్రమబద్దీకరిస్తూ ఉంటాయి. ఫలితంగా డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అందుకే పాప్ కార్న్ తినేవారిలో పోలిస్తే తినని వారిలో మధేమేహంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందట. జీర్ణక్రియ సాఫీగా.. మన శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ సాఫీగా సాగాలన్నా మనం తీసుకునే ఆహారంలో తగినన్ని పీచు పదార్థాలు ఉండడం తప్పనిసరి. అప్పుడే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్దకం వంటి సమస్యలను దరి చేరనీయకుండా చేస్తుంది. పాప్ కార్న్ లో అధికస్థాయిలో ఉండే పీచు పదార్థాలు పేగుల పనితీరుని మెరుగుపరిచి జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.

బరువు తగ్గడానికి…. బరువు తగ్గాలనుకునే వారి ఏ స్నాక్స్ తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఆయా పదార్థాలు ఆహారంగా తీసుకుంటే తిరిగి బరువు పెరిగిపోతామేమో అనే భయమే అందుకు కారణం! అయితే బరువు తగ్గాలనుకునేవారు పాప్ కార్న్ నిస్సందేహంగా తినవచ్చు.
ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే పీచుపదార్థాలు అధిక సమయం కడుపు నిండుగా అనిపించేలా చేయడం మాత్రమే కాకుండా ఆకలికి కారణమయ్యే గ్రెలిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి కాకుండా ఆపుతాయి. తద్వారా ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా తర్వాత కూడా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటాం. అలాగే ఒక కప్పు పాప్ కార్న్ లో 30 కెలొరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి వీటిని ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చు.