1. రుచీ, పోషకాలు అందించే పండు ఖర్జూరం. అమ్మాయిలు రోజూ దీన్ని తింటే రక్తహీనత దరిచేరదు. సమపాళ్లలో పోషకాలు అంది, ఆరోగ్యంతో పాటు అందమూ సొంతమవుతుంది. 1. ఖర్జూరాల్లో కొవ్వు శాతం తక్కువ. విటమిన్లు ఖనిజాలూ, మాంసకృత్తులూ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఎ, బిలను కలిగి ఉండటం వల్ల తినే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతంది.
2. ఉద్యోగ, వ్యాపారాల్లో తలమునకలై ఉండే స్త్రీలు మధ్యలో ఓ రెండు తింటే చాలా. తక్షణ శక్తి అందుతుంది. అలసట మటుమాయమవుతుంది. 3. ఖర్జూరాల్లో పొటాషియం, క్యాల్షియం ఎక్కువ. కడుపుమంటను తగ్గించి, ఎముక బలాన్ని పెంచుతాయి. పీచు అరగుదలకు సాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే ఖర్కూజరాలు.. బరువునీ నియంత్రణలో ఉంచుతాయి. బరువు పెరగాంటే పాలతో కలిపి తీసుకోవాలి.