పోషకాల పుట్ట గొడుగు
పుట్టగొడుగుల్లో కెలొరీలు, పిండి, కొవ్వు పదార్థాలు తక్కువ ఇందులో పీచు పదార్థాం ఎక్కువగా
ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయులు అదుపులో ఉంచి గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం మంచిది.
మశ్రూమ్సలో విటమిన్ -సి అధికంగా ఉంటుంది. ఇది శరంలోని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయ పడుతుంది. వీటిని తినడం వల్ల మధుమేహం వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది.
పొటాషియం, మెగ్నీయం ఖనిజాలు పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్దీకరించి, ఎముకలు బలంగా మారడానికి
ఉపయోగపడతాయి.
ఇందులో సెలీనియం సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.
• పుట్టగొడుగుల్లోని కాపర్ ఎర్ర రక్తకణాలు పెరగడానికి తోడ్పడుతుంది. రక్తప్రసరణ సమంగా జరిగేలా చూస్తుంది.