బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..!
ఒక వ్యక్తి ఎత్తుకు తగిన బరువే ఉన్నా… ఎక్కడ తాను బరువు పెరుగుతానో అనే ఆందోళనలో ఉంటోంది. తగిన బరువున్నా దాన్ని పెరగకుండా చేయడం కూడా సవాలే. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు..
ఎనిమిది తర్వాత: రాత్రి 8 తర్వాత ఆహారాన్ని తీసుకోకూడదు. రాత్రి పూట శరీరం వ్యర్థాలను తొలగించే ప్రయ త్నంలో ఉంటుంది. అలాగే కొత్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. ఆ సమయానికి, జీర్ణవ్యవస్థ విధులు ముగించుకుని ఉంటేనే ఇవన్నీ వీలవుతాయి. అందుకే రాత్రి ఎనిమిది గంటల్లోపే భోజనం ముగిస్తే అది రెండుగంటల్లోపు జీర్ణమవుతుంది. అలా కాకుండా ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. అధిక బరువు సమస్య ఎదురవుతుంది.
చక్కెర: ఆహారంలో చక్కెరను తగ్గించుకోండి. పోషక విలువలు, కెలోరీలు లేని చక్కెర అధిక బరువుకు కారణమవుతుంది. ప్రాసెస్ట్ ఫుడ్, బర్గర్లు, పిజా, సమోసా, చిప్స్, కప్ నూడిల్స్, వేపుళ్లు, నూనె ఎక్కువగా ఉండే ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటిలో అధికస్థాయి సోడియం, చక్కెర, కొవ్వు వంటివి అనా రోగ్యానికి దారి తీస్తాయి. శరీరం బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే ఈ నియ మాన్ని తప్పక పాటించాలి. అలాగే వెజిటబుల్, రిఫైన్డ్ నూనెల వాడకానికి దూరంగా ఉండటం మేలు. వీటికి బదులుగా నెయ్యి, ఆవనూనె, ఆలివ్ నూనె వంటివి ఎంచుకోవాలి. శరీరానికి తగినంత నీరు అందేలా నిమ్మరసం, కొబ్బరినీళ్లు, తాజా పండ్లరసం, సూప్స్ వంటివి తీసుకుంటే మంచిది.చక్కెర: ఆహారంలో చక్కెరను తగ్గించుకోండి. పోషక విలువలు, కెలోరీలు లేని చక్కెర అధిక బరువుకు కారణమవుతుంది. ప్రాసెస్ట్ ఫుడ్, బర్గర్లు, పిజా, సమోసా, చిప్స్, కప్ నూడిల్స్, వేపుళ్లు, నూనె ఎక్కువగా ఉండే ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటిలో అధికస్థాయి సోడియం, చక్కెర, కొవ్వు వంటివి అనా రోగ్యానికి దారి తీస్తాయి. శరీరం బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే ఈ నియ మాన్ని తప్పక పాటించాలి. అలాగే వెజిటబుల్, రిఫైన్డ్ నూనెల వాడకానికి దూరంగా ఉండటం మేలు. వీటికి బదులుగా నెయ్యి, ఆవనూనె, ఆలివ్ నూనె వంటివి ఎంచుకోవాలి. శరీరానికి తగినంత నీరు అందేలా నిమ్మరసం, కొబ్బరినీళ్లు, తాజా పండ్లరసం, సూప్స్ వంటివి తీసుకుంటే మంచిది.