కొందరికి బస్సు ఎక్కితే వాంతులు మొదలవు తాయి. ఇంకొందరికి ట్రైన్ జర్నీ అంటే కడుపులో వికారం స్టార్ట్ అవుతుంది. దీన్ని మోషన్ సిక్ నెస్ అంటారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే.. మన చర్మం, కళ్లు, చెవుల నుండి కొన్ని వైబ్రేషన్ సిగ్నల్స్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ కు వెళాయి. ఇవి బ్రెయిన్ ని కన్ ప్యూజ్ చేసి మోషన్ సిక్ నెస్ కి కారణం అవుతాయి. అంటే వాంతులు, వికారం వంటివి. ఇలా జరగకుండా ఉండాలంటే…

మోషన్ సిక్ నెస్ ప్రాబ్లం ఉన్నవాళ్లు ఖాళీ కడుపుతో ట్రావెల్ చేస్తే వాంతులు అవ్వవు అనుకుంటుంటారు. కానీ అది తప్పు. అలా చేస్తే నీరసం వస్తుంది.అందుకే ఎక్కువ తినొద్దు, తినకుండా ఉండొద్దు. అలాగే మోషన్ సిక్ నెస్ ఉన్నవాళ్లు ట్రావెలింగ్ లో పుస్తకాలు పట్టకపోవడం మంచిది.
వేగించిన లవంగాల పొడిలో కొంచెం చక్కెర లేదా నల్ల ఉప్పుతో కలిపి తింటే వాంతులు అవ్వవు. జర్నీలో తులసి ఆకులు నమిలితే కూడా వాంతులు కావు. అలాగే నిమ్మరసంలో పుదీన కలిపి జర్నీ మధ్యలో అప్పుడప్పుడు తాగాలి. పండిన నిమ్మకాయ తొక్కను వాసన చూస్తే వాంతులు ఆగుతాయి.

ఈ ప్రాబ్లం ఉన్నవాళ్లు పెద్ద వెహికిల్స్ లో వెళ్తే వెనుక సీట్ లో అస్సలు కూర్చోకూడదు. ఎందుకంటే కుదుపులు వల్ల ఎక్కువ స్పీడ్ లో వెళ్తున్న ఫీల్ వస్తుంది. దానివల్ల తల తిరిగి వాంతులు అవుతాయి.