బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు
బొప్పాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతులేనివనే మెరుగైన ఆరోగ్యం కోసం బొప్పాయి తీసుకోవడమనేది అనాదిగా వస్తున్నదే. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఇంకా ఇతర పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలుండటం విశేషం. ఇందులో విటమిన్లతో పాటు మెగ్నీషియం , ఐరన్, కాల్షియం , ఫాస్పరస్, మాంగనీస్ వంటి మినరల్స్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
హార్ట్ ఎటాక్ నుంచి సంరక్షణ: – బొప్పాయయిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కొలెస్టాల్ తగ్గించేందుకు దోహదపడతాయి. బొప్పాయిలో ఉండే ఫోలేట్ కారణంగా రక్త నాళాలు పాడవకుండా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. బొప్పాయిలో ఉండే పొటాషియం మొత్తం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫలితంగా వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
డయాబెటిస్ రోగులు చాలావరకూ పండ్లను తినకూడదు. ఎందుకంటే చాలా పండ్లకు గ్లెసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పండ్లు తింటే షుగర్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. బొప్పాయిలో మాత్రం గ్లైసోమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ రోగులు బొప్పాయి హాయిగా తినవచ్చు. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మధుమేహ వ్యాధిగ్రస్థులకు లాభదాయకం.
ఎనిమియాకు చెక్: బొప్పాయిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎనీమియా వంటి వ్యాధుల్లో ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ తినడం వల్ల ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలు దూరమౌతాయి. బొప్పాయితో ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ తగ్గుతుంది బొప్పాయిలో ఉండే విటమిన్ కే ఎముకల్లోని కాల్షియం కొరతను తీరుస్తుంది. బొప్పాయి వల్ల ఎముకలకు సంబంధించిన నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆర్ధరైటిస్ వ్యాధులు దూరమౌతాయి.
ఇమ్యూనిటీ బూస్ట్ : బొప్పాయి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటిమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక బొప్పాయితో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే..వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బొప్పాయి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ బలోపేతమౌతుంది. మల బద్దకం, గ్యాస్ వంటి సమస్యలు దూరమౌతాయి.